breaking news
Army truck
-
పూంఛ్ ఘటనను ఉగ్రదాడిగా తేల్చిన ఆర్మీ
-
పూంఛ్ ఘటన ప్రమాదం కాదు.. ఉగ్రదాడి: భారత ఆర్మీ
ఢిల్లీ: జమ్ముకశ్మీర్ పూంచ్‌లో గురువారం జవాన్ల ట్రక్కుకు జరిగింది ఘోరం ప్రమాదం కాదని.. అది ఉగ్రదాడి అని భారత సైన్యం నిర్ధారించింది. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు దుర్మరణం పాలైనట్లు ప్రకటించింది ఆర్మీ. జమ్ము-పూంచ్ హైవేపై రాజౌరీ సెక్టార్ తోతావాలి గల్లీ దగ్గర జవాన్లు వెళ్తున్న ట్రక్కుపై ఉగ్రవాదులు గ్రనేడ్లు విసిరారని, మంటలు చెలరేగి రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్‌కు చెందిన ఐదుగురు జవాన్లు వీరమరణం చెందినట్లు ఆర్మీ తెలిపింది. మరో జవాన్ గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ జవాన్లను ఉగ్రవాద కార్యకలాపాల కట్టడికి మోహరించే క్రమంలోనే ఈ ఘోరం జరిగింది. వర్షం పడుతుండడంతో ట్రక్కు నెమ్మదిగా వెళ్లోందని, ఇది ఆసరాగా తీసుకుని ఉగ్రవాదులు గ్రనేడ్లు విసిరి దాడికి పాల్పడ్డారని సైన్యం తెలిపింది. తొలుత ఇది పిడుగు ప్రమాదంగా భావించిన ఆర్మీ.. దర్యాప్తునకు ఆదేశించింది. సీనియర్ ఆర్మీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించగా.. చివరికి ఉగ్రదాడిగానే తేల్చింది. -
దూసుకెళ్లిన వాహనం: ఆర్మీ జవాన్లు సురక్షితం
ఘజియాబాద్ : ఆర్మీ జవాన్లు మృత్యుముఖం నుంచి తృటీలో బయటపడ్డారు. జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం గంగా కెనాల్లోకి దూసుకెళ్లింది. దీంతో అక్కడే ఉన్న స్థానిక డ్రైవర్లు వెంటనే స్పందించి... కెనాల్లోకి దూకి ఆరుగురు ఆర్మీ జవాన్లను రక్షించారు. ఈ సంఘటన బుధవారం ఉత్తరప్రదేశ్‌లోని మురాద్ నగర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. డ్రైవర్ ఆర్మీ వాహనాన్ని వేగంగా నడుపుతున్నారు. మీరట్ కంటోన్మెంట్ నుంచి న్యూఢిల్లీ వెళ్తున్న క్రమంలో ఈ వాహనం బ్రేకులు ఫెయిల్ అయ్యాయని పోలీసులు తెలిపారు.