నగల వ్యాపారిని హత్య చేసిన దుండగులు | Jeweler Stabbed to Death By Robbers in Goa Margao | Sakshi
Sakshi News home page

నగల వ్యాపారిని హత్య చేసిన దుండగులు

Sep 3 2020 10:44 AM | Updated on Sep 3 2020 10:44 AM

Jeweler Stabbed to Death By Robbers in Goa Margao - Sakshi

పనాజీ: గోవాలోని మార్గావ్ ప్రాంతంలో సప్నా ప్లాజా సమీపంలో స్వాప్నిల్ వాల్కే అనే 41 ఏళ్ల  జ్యూవెలరీ షాపు యజమానిని దుండగులు హత్య చేశారు. కత్తులతో పొడవడంతో వ్యాపారి మృతి చెందాడు. దక్షిణ గోవా పోలీసు సూపరింటెండెంట్ మాట్లాడుతూ, ‘సప్నా ప్లాజా సమీపంలోని మార్గావ్ ఏరియాలో ఒక ఆభరణాల వ్యాపారిపై దాడి చేసినట్లు పోలీస్‌ స్టేషన్‌కు కాల్‌ వచ్చింది.  వెంటనే పోలీస్ ఇన్స్పెక్టర్ మార్గవో టౌన్ సిబ్బందితో పాటు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే ఆయన తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆయనను హోస్పిసియో ఆసుపత్రికి తరలించారు. అక్కడ బాధితుడు చనిపోయినట్లు ప్రకటించారు అని ఆయన తెలిపారు. 

సంఘటన స్థలంలో ఒక నాటు తుపాకీ, 3 లైవ్‌రౌండ్లు, ఒక కత్తి కవర్‌ స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. ఈ సంఘటన తరువాత ముగ్గురు వ్యక్తులు వీధి చివరకు పరుగెత్తుకొని వెళ్లడాన్ని అక్కడ ఉన్న చుట్టు పక్కన వారు వీడియో తీశారు. ఈ కేసుకు సంబంధించి విచారణ చేస్తున్నామని, నిందుతులను గుర్తించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. దుకాణం లోపల, బయట ఉన్న సీసీటీవీ ఫుటేజ్లను స్వాధీనం చేసుకుని వాటిని పరిశీలిస్తున్నారు. 

చదవండి: టీనేజర్‌కు బెయిల్‌ నిరాకరించిన సుప్రీం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement