Mayur Shelke News: సూపర్ హీరోలకే హీరో: ప్రశంసలు, బంపర్ గిఫ్ట్‌ | Jawa Motorcycle Gifted To Mayur Shelke - Sakshi
Sakshi News home page

సూపర్ హీరోలకే హీరో: ప్రశంసలు, బంపర్ గిఫ్ట్‌

Apr 21 2021 2:11 PM | Updated on Apr 21 2021 5:59 PM

Jawa To Honour Railways Hero Mayur Shelke With A New Motorcycle - Sakshi

సమయానుకూలంగా స్పందించి, ప్రాణాలను పణంగా పెట్టి మరీ బాలుడిని కాపాడి హీరోగా నిలిచిన  రైల్వే ఉద్యోగి షెల్కేకు జావా మోటార్‌ సైకిల్‌ను గిఫ్ట్‌గా ప్రకటించింది.

సాక్షి, ముంబై: అత్యంత సాహసంతో బాలుడి ప్రాణాలను కాపాడిన రైల్వే ఉద్యోగిపై ప్రశంసల జల్లుకురవడమే కాదు విలువైన బహుమతులు కూడా లభిస్తున్నాయి. ప్రమాదవశాత్తూ రైల్వే ట్రాక్‌పై  నిలిచిపోయిన బాలుడిని  రక్షించిన మయూర్ షెల్కేని స్వయంగా రైల్వే శాఖమంత్రి పియూష్‌ గోయల్‌ అభినందించారు. రైల్వే మంత్రిత్వ శాఖ బహుమతిని కూడా  ప్రకటించింది. తాజాగా ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ ఈ కోవలో నిలిచింది.

సమయానుకూలంగా స్పందించి, ప్రాణాలను పణంగా పెట్టి మరీ బాలుడిని కాపాడి హీరోగా నిలిచిన షెల్కేకు జావా మోటార్‌ సైకిల్‌ను గిఫ్ట్‌గా ప్రకటించింది. మయూర్ షెల్కే ధైర్యసాహసాలు ప్రశంసనీయమంటూ క్లాసిక్ లెజెండ్స్ చీఫ్ అనుపమ్ థరేజా అభినందించారు. మొత్తం జావా కుటుంబం ఆయనను అభినందిస్తోందన్నారు. రైలు దూసుకొస్తున్నప్పటికీ బాలుడిని సురక్షితంగా కాపాడిన తీరు తమను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసిందని థరేజా పేర్కొన్నారు. జావా హీరోస్ ఇనీషియేషన్‌లో భాగంగా ఈ అవార్డు ఇస్తున్నామన్నారు. అంతేకాదు దేశవ్యాప్తంగా ఇలాంటి హీరోలను గుర్తించి జావా హీరోస్ పేరుతో సత్కరించనున్నామని వెల్లడించారు. దీనిపై మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా కూడా స్పందించారు. మూవీల్లోని సూపర్ హీరోలను మించిన హీరోగా మెరుగైన  ధైర్య సాహసాలను ప్రదర్శించారంటూ ట్వీట్‌ చేశారు.  జావా కుటుంబంలో మనమందరం  అతనికి సెల్యూట్‌ చేద్దామన్నారు. అలాగే క్లిష్ట సమయాల్లో ఎలా ప్రవర్తించాలో షెల్కే మనకు చూపించారంటూ ఆయన ప్రశంసించారు.(పట్టాలపై చిన్నారి..దూసుకొస్తున్న రైలు.. ఇంతలో)

కాగా  ఏప్రిల్ 17న వంగని రైల్వే స్టేషన్‌లో మయూర్‌ షెల్కే అత్యంత సాహసంతో బాలుడిన కాపాడిన వైనం చోటు చేసుకుంది. సీసీటీవీలో రికార్డైన ఈ దృశ్యాలను  రైల్వే శాఖ  సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వైరల్‌ అయింది. సెంట్రల్  రైల్వేలో పాయింట్స్‌మన్‌గా పని చేస్తున్నమయూర్ షెల్కేకు రైల్వే మంత్రిత్వ శాఖ రూ.50 వేలు బహుమతిగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement