
షిమ్లా: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ పరాజయం పాలైన విషయం తెలిసిందే. దీనిపై సీఎం జైరాం ఠాకూర్ స్పందించారు. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలలో బీజేపీ కేవలం 1% కంటే తక్కువ ఓట్లతో ఓడిపోయిందని తెలిపారు. అంతేగాక రాష్ట్ర చరిత్రలో కాంగ్రెస్ అతి తక్కువ ఓట్ షేర్‌తో విజయం సాధించిందని పేర్కొన్నారు. అయితే తాను ఎన్నికల ఫలితాలను గౌరవిస్తానని తెలిపారు. కాంగ్రెస్ త్వరలో తమ ముఖ్యమంత్రిని ఎన్నుకోని, రాష్ట్రం కోసం పనిచేయడం ప్రారంభిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.
మరోవైపు హిమాచల్‌లో బీజేపీ ఓటమిపై ప్రధాని మోదీ స్పందించారు. బీజేపీపై ఉన్న అభిమానానికి, పార్టీకి అందించిన మద్దతుకు హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ఆకాంక్షలను నెరవేర్చేందుకు, రాబోయే కాలంలో ప్రజల సమస్యలను లేవనెత్తేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.
చదవండి: Mainpuri Bypoll Result: ములాయం కోడలు డింపుల్ యాదవ్ బంపర్ విక్టరీ.. ఎన్ని లక్షల మెజార్టీ అంటే..