ప్రభుత్వం నిషేధం విధించిన యాప్‌లివే..

India Blocked 43 Chinese Apps Over Security Concerns - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: సరిహద్దుల్లో చైనాతో ఘర్షణల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో 43 చైనా మొబైల్‌ యాప్స్‌పై నిషేధం విధించింది. అలీబాబా గ్రూప్‌కి చెందిన ఈ కామర్స్‌ యాప్‌ అలీ ఎక్స్‌ప్రెస్‌ సహా కొన్ని డేటింగ్‌ యాప్‌లపై నిషేధం విధిస్తూ మంగళవారం ఉత్వర్వులు జారీ చేసింది. గల్వాన్‌ లోయలో భారత్‌తో ఘర్షణలకు దిగిన డ్రాగన్‌ దేశానికి బుద్ధి చెప్పడం కోసం ఈ ఏడాది జూన్‌ 29న తొలిసారిగా 59 యాప్‌లపై నిషేధం విధించిందించిన విషయం తెలిసిందే. చదవండి: మరో 47 చైనా యాప్‌లపై నిషేధం

నిషేధం విధించిన యాప్‌లివే..

► అలీ సప్లయర్స్‌ మొబైల్‌ యాప్‌ 
► అలీబాబా వర్క్‌ బెంచ్‌ 
► అలీ ఎక్స్‌ప్రెస్‌– స్మార్టర్‌ షాపింగ్‌ బెటర్‌ లివింగ్‌ 
► అలీ పే క్యాషియర్‌ 
► లాలామూవ్‌ ఇండియా – డెలివరీ యాప్‌ 
► డ్రైవ్‌ విత్‌ లాలామూవ్‌ ఇండియా 
► స్నాక్‌ వీడియో 
► క్యామ్‌ కార్డ్‌ – బిజినెస్‌ కార్డు రీడర్‌ 
► క్యామ్‌కార్డ్‌ – బీసీఆర్‌ (వెస్టర్న్‌) 
► సోల్‌ – ఫాలో ది సోల్‌ టు ఫైండ్‌ యూ 
► చైనీస్‌ సోషల్‌ 
► డేట్‌ ఇన్‌ ఆసియా 
► విడేట్‌ 
► ఫ్రీడేటింగ్‌ యాప్‌  
► అడోర్‌ యాప్‌ 
 ట్రూలీ చైనీస్‌ 
► ట్రూలీఆసియాన్‌ 
► చైనాలవ్‌ 
► డేట్‌మైయాజ్‌ 
 ఆసియాన్‌డేట్‌ 
► ఫ్లర్ట్‌విష్‌ 
► గైస్‌ ఓన్లీ డేటింగ్‌ 
► ట్యుబిట్‌ 
► వివర్క్‌చైనా 
► ఫస్ట్‌ లవ్‌ లివ్‌ 
► రేలా 
► క్యాషియర్‌ వాలెట్‌ 
► మ్యాంగో టీవీ 
► ఎంజీటీవీ–హునాన్‌ టీవీ 
► వుయ్‌టీవీ–టీవీ వెర్షన్‌ 
► వుయ్‌టీవీ–సిడ్రామా 
► వుయ్‌టీవీ లైట్‌ 
► లక్కీ లైవ్‌ 
► తావోబావో లైవ్‌ 
► డింగ్‌టాక్‌ 
► ఐడెంటిటీ వీ 
► ఐల్యాండ్‌ 2 
► బాక్స్‌ స్టార్‌ 
► హీరోస్‌ ఎవాల్వ్‌ 
► హ్యాపీ ఫిష్‌ 
► జెల్లిపాప్‌ మ్యాచ్‌ 
► మంచికన్‌ మ్యాజ్‌ 
► కాంక్విస్టా ఆన్‌లైన్‌  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top