Independence Day 2021: 75వ వేడుకలు.. స్వాతంత్య్ర పోరాటపు ఫొటోలు చూసేయండి

Independence Day 2021 Indian Freedom Struggle Rare Photos - Sakshi

Independence Day 2021: రెండు వందల ఏళ్లకు పైగా పరాయి పాలనలో మగ్గిన, అణచివేతకు గురైన భారత్‌.. తొంభై ఏళ్ల సుదీర్ఘ పోరాటంతో స్వాతంత్య్రం సాధించుకుంది. మహా మహా నాయకుల సారధ్యంలో ప్రజా పోరాటం.. ప్రాణ త్యాగాలతో స్వేచ్ఛను పొందింది. ఆ పోరాటం గురించి ఎంత చెప్పినా తక్కువే. అందుకే 75వ స్వాతంత్య్ర దినోత్సవం 75th Independence Dayసందర్భంగా ఆ మహా సంగ్రామం తాలుకా చిత్రాలు కొన్ని మచ్చుకు మీ కోసం.. 

1857 సిపాయిల తిరుగుబాటును స్వాతంత్య్ర పోరాటంలో కీలక ఘట్టంగా అభివర్ణిస్తుంటారు చరిత్రకారులు. ఆ పోరాటంలో ఓడినప్పటికీ.. ఆంగ్లేయులకు మాత్రం మన తొలి దెబ్బ ఎలా ఉంటుందో తెలిసొచ్చింది. కావ్న్‌పోర్‌(కాన్పూర్‌) దగ్గర 1858లో జరిగిన పోరాటానికి సంబంధించిన ప్రతీకాత్మక చిత్రం ఇది.
 

స్వరాజ్య లక్క్ష్యంతో మహాత్మా గాంధీ మొదలుపెట్టిన సహాయ నిరాకరణోద్యమం హింసాత్మకంగా మారింది. 1922 ఫిబ్రవరి 4న  ఉద్యమకారుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. చౌరీ చౌరా పోలీస్‌ స్టేషన్‌కు నిప్పటించి.. 20 మందికిపైగా పోలీసాఫీసర్లను సజీవంగా దహనం చేశారు.
 

1930 ఉప్పు సత్యాగ్రహం సందర్భంగా.. దండి మార్చ్‌లో పాల్గొన్న గాంధీ, పక్కన సరోజినీ నాయుడు
 

విదేశీ వస్తువుల బహిష్కరణ ఉద్యమంలో భాగంగా.. వస్తువులతో వస్తున్న ఎడ్ల బండికి అడ్డుగా పడుకుని శాంతియుత నిరసన వ్యక్తం చేస్తున్న నిరసనకారుడు

క్విట్‌ ఇండియా ఉద్యమం.. సైమన్‌ గో బ్యాక్‌ నినాదంతో ర్యాలీ చేపట్టిన కాంగ్రెస్‌ కార్యకర్తలు

గాంధీ, కాంగ్రెస్‌ నేతల అరెస్ట్‌కు నిరసనగా చేపట్టిన ప్రదర్శనలో ఆందోళనకారుల్ని చెదరగొట్టేందుకు బ్రిటిష్‌ సైన్యం టియర్‌ గ్యాస్‌ ప్రయోగం

ఫిబ్రవరి 20, 1947న స్వాతంత్య్ర ప్రకటన చేసిన బ్రిటిష్‌ ప్రధాని క్లెమెంట్‌ అట్లీ

 సంబురంగా ప్రజల మధ్య శాంతి కపోతాన్ని ఎగరేసిన నెహ్రూ

ఎర్రకోట సంబురాల్లో ప్రధాని హోదాలో నెహ్రూ

ఆగష్టు 16, 1947.. ఎర్రకోట నుంచి రెపరెపలాడుతూ కనిపించిన మువ్వన్నెల జెండా

దేశ విభజన తర్వాత సెప్టెంబర్‌, 1947లో భారత్‌ నుంచి పాక్‌కు పయనమైన వందలాది మంది

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top