శశికళ ఆస్తులను ఫ్రీజ్‌ చేసిన ఐటీ అధికారులు

Income Tax Department Freezes Sasikalas Assets - Sakshi

చెన్నై : తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు అత్యంత సన్నిహితురాలైన శశికళకు బుధవారం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆదాయ పన్ను అధికారులు ఆమెకు చెందిన రూ 2000 కోట్ల విలువైన ఆస్తులను బినామీ నిరోధక చట్టం కింద స్తంభింపచేశారు. వీటిలో రూ 300 కోట్ల విలువైన రెండు ఆస్తులున్నాయి. సిరుతవుర్‌, కొడనాడు ప్రాంతాల్లోని ఈ ఆస్తులు జయలలిత సన్నిహితురాలు శశికళ, ఇలవరసి, సుధాకరన్‌ల పేరు మీద ఉన్నట్టు ఐటీ అధికారులు గుర్తించారు.

స్తంభింపచేసిన ఆస్తులకు ఆదాయపన్ను శాఖకు చెందిన బినామీ నిరోధక విభాగం అధికారులు నోటీసులు అతికించారు.  కాగా, దివంగత సీఎం జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళ అక్రమాస్తుల కేసులో బెంగళూరు పర్పప్పన అగ్రహార జైలులో ఉన్న విషయం తెలిసిందే. శిక్షా కాలం ముగిసి వచ్చే ఏడాది జనవరిలో ఆమె విడుదల కానున్నట్టు సమాచారం హక్కు చట్టం ద్వారా వెలుగులోకి వచ్చింది. చదవండి : చిన్నమ్మకు కొత్త చిక్కులు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top