ICMR New Guidelines: ఐసీఎంఆర్‌ నూతన మార్గదర్శకాలు.. ఈ లక్షణాలు ఉన్నవారికే కోవిడ్‌ పరీక్షలు

ICMR Issues New Guidelines Covid Tests Check Out Who Needs Get Tested - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా పరీక్షలకు సంబంధించి భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) కీలక మార్గదర్శకాలు జారీచేసింది. లక్షణాలు లేని వారు కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. దగ్గు, జ్వరం, గొంతులో సమస్య, రుచి, వాసన కోల్పోయినవారు మాత్రం తప్పనిసరిగా పరీక్ష చేయించుకోవాలని ఐసీఎంఆర్‌ స్పష్టంచేసింది.  దాంతోపాటు వయసు రీత్యా, అనారోగ్య సమస్యల పరంగా హై రిస్క్‌ కేటగిరీలోకి రాకపోతే.. కోవిడ్ క్లోజ్ కాంటాక్ట్స్‌కు కూడా పరీక్షలు అవసరం లేదని పేర్కొంది. 

హోం ఐసోలేషన్ మార్గదర్శకాల ప్రకారం డిశ్చార్జి అయిన పేషెంట్లు, రాష్ట్రాల మధ్య ప్రయాణించే వారు... కోవిడ్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదని ఐసీఎంఆర్‌ ప్రకటించింది. ర్యాపిడ్‌ టెస్టుల్లో పాజిటివ్ వస్తే దాన్ని పరిగణలోకి తీసుకోవాలని, మళ్లీ పరీక్ష చేయించాల్సిన అవసరం లేదని పేర్కొంది. నెగెటివ్ వచ్చినప్పటికీ కోవిడ్ లక్షణాలు కనిపిస్తుంటే మాత్రం ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవాలని సూచించింది.
(చదవండి: భారీగా కేసులు.. వారందరికీ వర్క్‌ ఫ్రం హోం ఇవ్వండి!)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top