వినియోగదారుల ఫిర్యాదుల విచారణ.. ఇక ఆన్‌లైన్‌లో!

Hearings of consumer complaints online Soon - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: వినియోగదారుల ఫిర్యాదులపై విచారణను ఇకపై ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు ఆరంభించింది. ఇది అమల్లోకి వస్తే ఫిర్యాదుదారులు భౌతికంగా కేసుల విచారణకు హాజరయ్యే అవసరం గణనీయంగా తగ్గనుంది. 

పెండింగ్‌ కేసుల భారాన్ని తగ్గించేందుకు, కేసులను సత్వరమే పరిష్కరించేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్‌కుమార్‌ సింగ్‌ ప్రకటించారు. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ఉండే అన్ని వినియోగదారుల కమిషన్‌లలో త్వరలోనే ఈ ఆన్‌లైన్‌ సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.

ఇదీ చదవండి: రోడ్డు ప్రమాదంలో సరబ్‌జిత్‌ సింగ్‌ భార్య కన్నుమూత

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top