
ఏఎన్‌ఐతో మాట్లాడుతున్న హరియాణా హోం మంత్రి అనిల్ విజ్
చండీగఢ్: కరోనా మహమ్మారితో జీవనోపాధి కోల్పోయి ఇబ్బందులు పడే పేదలను ఆదుకునేందుకు హరియాణా ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ క్రమంలో దారిద్య్ర రేఖకు (బీపీఎల్) దిగువన ఉన్న కుటుంబాలకు 5 వేల రూపాయల నగదు సాయం అందిస్తామని హరియాణా హోం మంత్రి అనిల్ విజ్ సోమవారం ప్రకటించారు. కరోనా మహమ్మారి కట్టడికి లాక్‌డౌన్ విధించిన క్రమంలో జీవనోపాధి కోల్పోయిన బీపీఎల్ కుటుంబాలకు నగదు సాయం అందించాలని నిర్ణయించామని మంత్రి వెల్లడించారు.
రాష్ట్రంలో విధించిన లాక్‌డౌన్ మరికొంత కాలం కొనసాగుతుందని అనిల్ విజ్ తెలిపారు. మే 10 నుంచి 17 వరకూ ‘సురక్షిత్ హరియాణా’ పేరిట కరోనాపై ప్రజలను అప్రమత్తం చేసే కార్యక్రమం చేపడతామన్నారు. లాక్‌డౌన్‌కు తోడు కఠిన నియంత్రణలను అమలు చేస్తామని చెప్పారు. అంత్యక్రియలు, వివాహ వేడుకలకు ల11 మందికి మించి అనుమతి లేదని స్పష్టం చేశారు. ఇక గడిచిన 24 గంటల్లో హర్యానాలో 13,548 తాజా పాజిటివ్ కేసులు వెలుగుచూడగా 151 మంది మహమ్మారి బారినపడి మరణించారు.
చదవండి: ‘వ్యాక్సిన్ల కొరత.. డబ్బులిచ్చి కొందామన్న లభించడం లేదు’