MLA Jignesh Mevani: గుజరాత్‌ ఎమ్మెల్యే అరెస్ట్‌

Gujarat MLA Jignesh Mevani Arrested By Assam Police - Sakshi

అహ్మదాబాద్‌: గుజరాత్‌ ఎమ్మెల్యే, దళిత నాయకుడు జిగ్నేష్‌ మేవానీని అస్సాం పోలీసులు అరెస్ట్‌ చేశారు. బనస్కాంత జిల్లాలోని పాలన్‌పూర్‌ సర్క్యూట్‌ హౌజ్‌ వద్ద బుధవారం రాత్రి 11.30 నిమిషాలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ ట్వీట్‌పై చెలరేగిన వివాదంలో ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారు.

జిఘ్నేష్‌ అరెస్టును ఆయన మద్దతుదారులు ధ్రువీకరించారు. అయితే పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ కాపీ లేకుండానే ఎమ్మెల్యేను అరెస్టు చేశారని వారు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే జిగ్నేష్‌ మేవానిపై అస్సాం పోలీసులు నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కొన్ని రోజుల క్రితం ఒక కమ్యూనిటీని కించపరచడం, రెండు వర్గాల మధ్య ఘర్షణ సృష్టించేందుకు కుట్ర పన్నడం, శాంతియుత వాతావరణానికి విఘాతం కలిగించడం.. వంటి ట్వీట్‌లు చేసినందుకు ఎమ్మేల్యే జిగ్నేష్‌ మేవానీపై పోలీసులు ఈ కేసులు నమోదు చేసినట్టు తెలిసింది.
చదవండి: జహంగీర్‌పురి కూల్చివేతలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

స్వతంత్ర ఎమ్మెల్యే..కాంగ్రెస్‌కు మద్దతు
జిగ్రేష్‌ మేవానీ వేద్గాం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి శాసనసభ సభ్యుడిగా గెలుపొందారు. అయితే, ఆయన గత సెప్టెంబర్‌లో కాంగ్రెస్‌కు మద్దతు తెలుపుతున్నానని ప్రకటించారు. జిగ్నేష్ మేవానీతో పాటు సామాజిక కార్య‌క‌ర్త, రాజకీయ నాయకుడు, జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ నాయకుడు కన్హయ్య కుమార్ గత ఏడాది సెప్టెంబర్‌లో కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్ గాంధీతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆ సమయంలో కన్హయ్య కూమార్‌ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ.. మేవానీ మాత్రం ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యేగా తన పదవీ కాలం ఉన్నంత వరకు కాంగ్రెస్‌కు మద్దతు తెలుపుతానని ప్రకటించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top