breaking news
Palanpur
-
గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ అరెస్ట్
అహ్మదాబాద్: గుజరాత్ ఎమ్మెల్యే, దళిత నాయకుడు జిగ్నేష్ మేవానీని అస్సాం పోలీసులు అరెస్ట్ చేశారు. బనస్కాంత జిల్లాలోని పాలన్పూర్ సర్క్యూట్ హౌజ్ వద్ద బుధవారం రాత్రి 11.30 నిమిషాలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ ట్వీట్‌పై చెలరేగిన వివాదంలో ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారు. జిఘ్నేష్ అరెస్టును ఆయన మద్దతుదారులు ధ్రువీకరించారు. అయితే పోలీసులు ఎఫ్ఐఆర్ కాపీ లేకుండానే ఎమ్మెల్యేను అరెస్టు చేశారని వారు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానిపై అస్సాం పోలీసులు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కొన్ని రోజుల క్రితం ఒక కమ్యూనిటీని కించపరచడం, రెండు వర్గాల మధ్య ఘర్షణ సృష్టించేందుకు కుట్ర పన్నడం, శాంతియుత వాతావరణానికి విఘాతం కలిగించడం.. వంటి ట్వీట్లు చేసినందుకు ఎమ్మేల్యే జిగ్నేష్ మేవానీపై పోలీసులు ఈ కేసులు నమోదు చేసినట్టు తెలిసింది. చదవండి: జహంగీర్‌పురి కూల్చివేతలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు స్వతంత్ర ఎమ్మెల్యే..కాంగ్రెస్‌కు మద్దతు జిగ్రేష్ మేవానీ వేద్గాం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి శాసనసభ సభ్యుడిగా గెలుపొందారు. అయితే, ఆయన గత సెప్టెంబర్‌లో కాంగ్రెస్‌కు మద్దతు తెలుపుతున్నానని ప్రకటించారు. జిగ్నేష్ మేవానీతో పాటు సామాజిక కార్యకర్త, రాజకీయ నాయకుడు, జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ నాయకుడు కన్హయ్య కుమార్ గత ఏడాది సెప్టెంబర్‌లో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆ సమయంలో కన్హయ్య కూమార్ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ.. మేవానీ మాత్రం ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా తన పదవీ కాలం ఉన్నంత వరకు కాంగ్రెస్‌కు మద్దతు తెలుపుతానని ప్రకటించారు. -
కండక్టర్ కామాంధుడైన వేళ..
పలాన్పూర్: ప్రతిరోజు పాఠశాలకు వెళ్లి హాయిగా చదువుకుంటున్న ఓ పద్నాలుగేళ్ల బాలికకు తన బస్సు ప్రయాణం నిద్రలేని రాత్రిని మిగులుస్తుందని ఊహించలేదు. స్కూల్ వెళుతున్న తనను బస్ కండక్టర్ అసహ్యం పుట్టేలా మాటలు అనడంతోపాటు అసభ్యకరంగా స్పృషించేందుకు ప్రయత్నించడంతో బెదిరిపోయి రన్నింగ్ బస్సులో నుంచి దూకేసింది. దీంతో ఆ బాలికకు గాయాలు అయ్యాయి. ఈ సందర్భంగా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం పాలన్పూర్ అనే గ్రామానికి చెందిన బాలిక తొమ్మిదో తరగతి చదువుతోంది. గుజరాత్ ప్రభుత్వం నడిపే ఆర్టీసీ ద్వారా ఓ స్కూల్ వెళుతుంటుంది. మంగళవారం కూడా అలాగే బయలుదేరింది. బస్సు ఎక్కేసరికి అందులో డ్రైవర్ కండక్టర్ తప్ప ఇంకెవరూ లేరు. దీంతో బయపడిన ఆ బాలిక డోర్ వద్దే నిల్చుంది. అయితే, అలా నిల్చోవద్దని సీట్లో కూర్చోవాలని ఈశ్వర్ భాయ్(49) అనే కండక్టర్ చెప్పాడు. అనంతరం ఆ బాలిక పక్కనే కూర్చుని అసభ్యకరంగా మాట్లాడటంతోపాటు లైంగిక వేధింపులకు దిగాడు. దీంతో భయపడిన ఆ బాలిక రన్నింగ్ లోనే బస్సులో నుంచి కిందికి దూకేసింది. ఈ మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు కండక్టర్ ను అరెస్టు చేశారు. బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.