వ్యాక్సిన్‌తో తొలి మరణం ఇదే.. ప్రభుత్వం ధ్రువీకరణ

Govt Confirms First Death After Covid Vaccination In India - Sakshi

న్యూఢిల్లీ: దేశంలో కరోనాను కట్టడి చేసేందుకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. టీకా తీసుకున్న తరువాత  కొద్దిమందిలో దుష్ప్రభావాలు తలెత్తుతున్న విషయం తెలిసిందే. వ్యాక్సిన్‌ పొందాక ఒకటి రెండు రోజుల పాటు కనిపించే అనారోగ్య లక్షణాలను చూసి పెద్దగా భయపడవద్దని.. అవి రోగనిరోధక వ్యవస్థ క్రియాశీలం కావడానికి సంబంధించిన సంకేతాలని మామూలేనని నిపుణులు పేర్కొన్నారు. వ్యాక్సిన్‌ తీసుకున్న తరువాత ఒకటి రెండు రోజులు పాటు శారీరక శ్రమ ఎక్కువగా ఉండే పనులు చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు. 

కాగా వ్యాక్సిన్‌ వేసుకున్న అనంతరం అనారోగ్యానికి గురై మరణించిన వారు కూడా ఉన్నారు. అయితే వారి మరణాలు పూర్తిగా వ్యాక్సిన్‌ వల్లే కావని వైద్యులు కొట్టిపారేశారు. ఇప్పటి వరకు వ్యాక్సిన్‌ తీసుకోవడం వల్లనే చనిపోయినట్లు ఎక్కడా ధృవీకరించలేదు. కానీ మొదటిసారి వ్యాక్సిన్‌ వల్ల ఓ వ్యక్తి చనిపోయినట్లు ప్రభుత్వం పేర్కొంది. టీకా వేసుకున్న తరువాత వ్యాక్సిన్‌ దుష్ప్రభావాలను అధ్యయనం చేస్తున్న అడ్వర్స్‌ ఈవెంట్స్‌ ఫాలోయింగ్‌ ఇమ్యునైజేషన్‌(ఏఈఎఫ్‌ఐ) టీకా మరణాన్ని ధ్రుృవీకరించింది. మార్చి 8న కరోనావైరస్ వ్యాక్సిన్ తీసుకున్న 68 ఏళ్ల వ్యక్తి అనాఫిలాక్సిస్(తీవ్ర ఎలర్జీ) కారణంగా మరణించినట్లు మంగళవారం వెల్లడించింది. 

చదవండి: కొత్తగా మరో వ్యాక్సిన్‌..! వేరియంట్లను సమర్థవంతంగా ఎదుర్కొనే సామర్థ్యం...!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top