చైనాకు భారత్‌ మరో షాక్‌.. 54 చైనా యాప్‌లపై నిషేధం

Govt blocks 54 more Chinese apps over security threat - Sakshi

న్యూఢిల్లీ: దేశ భద్రతకు, ప్రైవసీకి ప్రమాదంగా మారుతున్నాయంటూ మరో 54 చైనా మొబైల్‌ యాప్‌లను సోమవారం కేంద్రం నిషేధించింది. కేంద్ర హోం శాఖ సిఫార్సు మేరకు ఐటీ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ శాఖ మధ్యంతర ఉత్తర్వులిచ్చినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ‘‘ఈ యాప్స్‌ యూజర్ల తాలూకు వ్యక్తిగత డేటాను దుర్వినియోగం చేస్తున్నాయని, ఎప్పటికప్పుడు శత్రు దేశపు సర్వర్లకు పంపుతున్నాయి. తద్వారా దేశ సమగ్రతకు, సార్వభౌమత్వానికి సమస్యగా మారాయి.

దేశ రక్షణకు కూడా ముప్పుగా తయారయ్యాయి’’ అని వివరించాయి. గెరెనా ఫ్రీ ఫైర్‌–ఇల్యుమినేట్, టెన్సెంట్‌ ఎక్స్‌రివర్, నైస్‌వీడియో బైదు, వివా వీడియో ఎడిటర్, బ్యూటీ కెమెరా: స్వీట్‌ సెల్ఫీ హెచ్‌డీ, మ్యూజిక్‌ ప్లేయర్, మ్యూజిక్‌ ప్లస్, వాల్యూమ్‌ బూస్టర్, వీడియో ప్లేయర్స్, యాప్‌లాక్, మూన్‌చాట్, బార్‌కోడ్‌ స్కానర్‌–క్యూఆర్‌ కోడ్‌స్కాన్‌ వంటివి ఈ జాబితాలో ఉన్నట్టు వివరించాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top