విమానాన్ని ఢీకొట్టిన పక్షి.. అర్థాంతరంగా నిలిపివేత..

Goair Flight From Bengaluru Suffers Bird Hit At Patna - Sakshi

పాట్నా: బెంగళూరు నుంచి బిహార్ మీదుగా వెళ్తున్న గోఎయిర్ విమానాన్ని పాట్నా ఎయిర్‌పోర్టులో పక్షి ఢీకొట్టింది. దీంతో ఫ్లయిట్‌ను అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఈ ఘటనలో ఒక ఇంజిన్ రెక్కలు విరిగిపోవడంతో ఢిల్లీకి వెళ్లాల్సిన విమానం అర్థాంతరంగా రద్దయింది. 

ఘటన జరిగినప్పుడు విమానంలో 142 మంది ప్రయాణికులు, ఆరుగరు సిబ్బంది ఉన్నారు. విమానం రద్దు అయినందున ప్యాసెంజర్లు ఢిల్లీకి చేరుకునేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు గోఎయిర్ తెలిపింది. ప్రయాణాన్ని రద్ధు చేసుకున్న వారికి టికెట్ డబ్బులు తిరిగి చెల్లించినట్లు పేర్కొంది.

పాట్నా ఎయిర్ పోర్టులో పక్షులు విమానాలను ఢీకొట్టిన ఘటనలు ఇప్పటికే పలుమార్లు జరిగాయి. విమానాశ్రయానికి అతి సమీపంలో మాంసం దుకాణాలు ఉండటంతో పెద్ద పెద్ద పక్షులు ఇక్కడ సంచరిస్తున్నాయి. మాంసం దుకాణాలను వేరే చోటకు తరలించాలని ప్రతిపాదనలు ఉన్నప్పటికీ అమలుకు నోచుకోవడం లేదు.
చదవండి: 'అంబానీ, అదానీ రాహుల్‌ను కొనలేరు.. నా అన్న వారియర్..'

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top