ఈ అద్దాలు పెట్టుకుంటే మనకూ పిల్లి కళ్లు!

Gallium Arsenide Glasses Can See Night Vision Very Clear - Sakshi

పిల్లులు రాత్రి పూట కూడా చూడగలవు.. మరి మనం.. ఇదిగో ఈ కళ్లద్దాలు పెట్టుకుంటే.. మనం కూడా పిల్లిలా రాత్రి పూట చూసేయొచ్చట.. అదేంటో మరి తెలుసుకుందామా.. 

ఇలా చూసేద్దాం.. 
చీకట్లో ఏ వస్తువునూ చూడలేం.. రాత్రి అతినీల లోహిత కిరణాలు వెలువడుతాయి. వాటిని మానవ నేత్రం చూడలేదు. కానీ నానో టెక్నాలజీని ఉపయోగించి రాత్రి కూడా చూడగలిగేలా మన వెంట్రుక కన్నా వంద రెట్లు పలుచటి పొర (అల్ట్రాథిన్‌ క్రిస్టల్‌ ఫిల్మ్‌)ను ఆస్ట్రేలియన్‌ నేషన్‌ వర్సిటీ, నాటింగ్‌హామ్‌ ట్రెంట్‌ వర్సిటీల ఆధ్వర్యంలోని అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం అభివృద్ధి పరిచింది. ఆ పొరను మన కళ్లద్దాలకు పెట్టుకుంటే సరి.. రాత్రి చీకట్లోనూ ఎంచక్కా చూసేయొచ్చు. 

ఇంతకీ ఇవెలా పనిచేస్తాయి?
గాలియం ఆర్సెనైడ్‌ పదార్థంతో ఈ ఫిల్మ్‌ను తయారుచేశారు. దీనిద్వారా ప్రసరించే కాంతి తాలూకు రంగు లేదా ఫ్రీక్వెన్సీ (పౌనఃపున్యం)ని ఇది మార్చుతుంది. అంటే రాత్రి వెలువడే అతినీల లోహిత కిరణాలను.. మనం చూడగలిగే కాంతి (విజిబుల్‌ లైట్‌)గా మార్చగలదు. అయితే చీకట్లో ఏదైనా వస్తువు వెలుతురులో ఉన్నట్లు కాకుం డా ఆకుపచ్చని రంగులో కన్పిస్తుంది. సాధారణంగా నైట్‌ విజన్‌ అద్దాలతో చూసినప్పుడు కని పించినట్లే ఉంటుందని పరిశోధకులు చెప్పారు. నైట్‌ విజన్‌ అద్దాలు బరువుగా ఉంటాయని.. ఇవి చాలా తేలిక, ఖర్చు తక్కు వని తెలిపారు. ఈ రెండింటిలో అతినీల లోహిత కిరణాలను మార్చే పద్ధతి వేర్వేరుగా ఉంటుందని పరిశోధకులు డ్రాగోమిర్‌ నెషేవ్‌ వివరించారు.  
 – సాక్షి సెంట్రల్‌ డెస్క్‌

చదవండి: 118 ఏళ్ల కింద.. టైమ్‌ ఎలా సెట్‌ చేశారు?

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top