వర్షం కురవాలని పెళ్లి .. వైరల్‌ వీడియో..

Frog Wedding Video: Tripura People Did Frogs Marriage For Rain Goes Viral	 - Sakshi

దేశంలో  కరోనా కల్లోలం వివాహలపై కూడా పెద్ద ప్రభావాన్నే చూపించింది. బంధువుల మధ్య ఆర్భాటంగా జరగాల్సిన పెళ్లిళ్లను కాస్త.. కొద్దిమంది సమక్షంలో ఏలాంటి సందడి లేకుండా జరుపుకుంటున్నారు. కాగా, త్రిపురలోని ఒక పట్టణంలో జరిగిన పెళ్లి సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, అది మనుషుల పెళ్లి కాదండోయ్‌.. కప్పల పెళ్లి. వివరాలు.. త్రిపురలో వర్షం కురవాలని కప్పల వివాహం జరిపించారు. దీంట్లో ఇద్దరు మహిళలు వారి చేతుల్లో రెండు కప్పలను పట్టుకున్నారు. వాటికి సంప్రదాయ బట్టలను కూడా తొడిగారు. అంతటితో ఆగకుండా అందులో మగకప్పచేత... ఆడకప్పకు బొట్టు పెట్టించారు.

అయితే.. దీంట్లో ఇద్దరు మహిళలు మాత్రం సామాజిక దూరాన్ని పాటించలేదు. దీన్ని చూసిన నెటిజన్లు  వావ్‌.. కరోనాలోనూ ఆగని పెళ్లి.. కాస్త సోషల్‌ డిస్టెన్స్‌ పాటిస్తే బాగుండేది.. మీ వల్ల కప్పలకు కరోనా సోకే ప్రమాదం ఉంది.. ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. అయితే, వర్షం సమృద్ధిగా  కురవాలని వానాకాలం వచ్చేముందు చాలా చోట్ల కప్పల పెళ్లిలు జరిపిస్తారనే సంగతి తెలిసిందే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top