ప్రణబ్‌ ఆరోగ్యం విషమమే

former president Pranab mukherjee health condition series - Sakshi

న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ (84) ఆరోగ్యం విషమంగానే ఉన్నట్లు ఆర్మీ రీసెర్చ్‌ అండ్‌ రెఫరల్‌ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఢిల్లీలోని కంటోన్మెంట్‌ ప్రాంతం లోని ఆసుపత్రిలో ప్రణబ్‌ 10వ తేదీన చేరిన విషయం తెలిసిందే. మొదడులో ఏర్పడ్డ ఒక అడ్డంకిని తొలగించేందుకు ఆయనకు శస్త్ర చికిత్స కూడా జరిగింది. అదే రోజు ఆయనకు కోవిడ్‌–19 పరీక్షలు జరపగా పాజిటివ్‌గా తేలింది.

ప్రణబ్‌ ముఖర్జీ ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని, వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నామని ఆర్మీ ఆసుపత్రి బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. మాజీ రాష్ట్రపతి త్వరగా కోలుకోవా లని ఆయన స్వగ్రామమైన బెంగాల్‌లోని మిరిటీలో మూడు రోజులుగా మృత్యుంజయ మంత్ర జపం నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా..ప్రణబ్‌ ముఖర్జీకి ఏది మంచిదైతే భగవంతుడు తనకు అదే ఇవ్వాలని కుమార్తె షర్మిష్ట ముఖర్జీ వ్యాఖ్యానించారు. దేశ అత్యున్నత పురస్కారం ‘భారత రత్న’అందుకున్న ఏడాదికే ఆయన ఆరోగ్యం విషమంగా మారడం తనను బాధిస్తోందని కాంగ్రెస్‌ నేత కూడా అయిన షర్మిష్ట తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top