ఐఏఎస్‌ హత్య కేసు నిందితుడి విడుదల దుమారం..బిహార్‌ సీఎంపై విమర్శలు

Ex MP Killed IAS Officer To Be Freed After Bihar Tweaks Prison Rules - Sakshi

బిహార్‌లోని జైలు మాన్యువల్‌ను సవరించిన కొద్ది రోజుల్లోనే ఐఏఎస్‌ను హతమార్చిన వ్యక్తి కూడా విడుదలైందుకు దారితీసింది . దీంతో నితీష్‌కుమార్‌ ప్రభుత్వంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నెల ప్రారంభంలోనే నితీష్‌ ప్రభుత్వం విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వోద్యోగిని హత్య చేసిన దోషులకు శిక్షను తగ్గించడాన్ని నిషేధించిన నిబంధనను తొలగించింది. ఈ మేరకు ఏప్రిల్‌ 20న బిహార్‌ రాష్ట్ర శిక్షా ఉపశమన మండలి సమావేశాన్ని దృష్టిలో ఉంచుకుని 14 లేదా 20 ఏళ్లు జైలు శిక్ష అనుభవిస్తున్న సుమారు 27 మంది ఖైదీలను విడుదల చేయాలని సంచలన నిర్ణయం తీసుకుంది బిహార్‌ ప్రభుత్వం.

ఐతే ఆ ఖైదీలలో 1994లో అప్పటి బ్యూరోక్రాట్‌ జీ కృష్ణయ్య హత్య కేసులో దోషిగా తేలిన మాజీ ఎంపీ ఆనంద్‌ మోహన్‌ సింగ్‌ కూడా ఉన్నారు. నిబంధనల మార్పుతో ఆనంద్‌ మోహన్‌ సింగ్‌ను విడుదల చేయడం పెను దుమారానికి దారితీసింది. ఆ ఐఏఎస్‌ అధికారి జి కృష్ణయ్య ఆంధప్రదేశ్‌లోని మెహబూబ్‌ నగర్‌కు చెందని నిరుపేద దళిత కుటుంబానికి చెందిన వ్యక్తి. అతన్ని అత్యంత దారుణంగా హత్య చేసిని మాజీ ఎంపీ, గ్యాంగ్‌స్టర్‌ ఆనంద్‌ మోహన్‌ను విడుదల చేసేందుకు నితీష్‌ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.

దీంతో బహుజన్‌ సమాజ్‌ పార్టీ నేత మాయవతి ట్విట్టర్‌లో ఆ నిబంధనల మార్పును దళిత వ్యతిరేకంగా పేర్కొంది. ఆ నిందితుడి విడుదల దళిత సమాజానికి కోపం తెప్పిస్తుందని, ఈ నిర్ణయాన్ని పునరాలోచించాలని నితీష్‌ కుమార్‌ ప్రభుత్వాన్ని కోరారు మాయవతి. బీజేపీ ఐటీ సెల్‌ హెడ్‌ అమిత్‌ మాలవీయా కూడా ఈ విషయమై నితీష్‌ కుమార్‌పై విరుచుకుపడ్డారు. కాగా  జేడీయూ నేత రాజీవ్ రంజన్ సింగ్ ఒక ట్వీట్‌లో.. నియమాలలో మార్పు సామాన్యులు, ప్రత్యేక ఖైదీలను ఏకరీతి ఒకే వేదికపైకి తీసుకురావడానికి ఉద్దేశించిందేనని సమర్థించుకునే యత్నం చేశారు. మరోవైపు రెండేళ్లుగా రాజ్‌పుత్‌ సామాజిక వర్గానికి చెందని పలువురు రాజకీయ నాయకులు సింగ్‌ను త్వరగా విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. అదీగాక బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ కూడా తన మాజీ సహోద్యోగికి అండగా ఉటానని పలు సందర్భాలలో వ్యాఖ్యానించడం గమనార్హం. 

(చదవండి: ట్రక్కు అదుపుతప్పడంతో నుజ్జునుజ్జు అయిన పెట్రోల్‌ పంపు)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top