రైతుల ఆదాయం పెరుగుతోంది

Ethanol blending with petrol helped increase income of farmers - Sakshi

 ప్రధాని మోదీ వెల్లడి

హిమ్మత్‌నగర్‌: రైతుల ఆదాయం పెంచేందుకు తమ ప్రభుత్వం గత ఎనిమిదేళ్లుగా తీసుకున్న వివిధ చర్యల ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయని ప్రధాని మోదీ చెప్పారు. 2014లో పెట్రోల్‌లో కలిపే ఇథనాల్‌ 40 కోట్ల లీటర్లు మాత్రమే కాగా, ఇప్పుడది 400 కోట్ల లీటర్లకు చేరుకుందన్నారు. మొట్టమొదటి సారిగా ఖాదీ, గ్రామీణ పరిశ్రమల టర్నోవర్‌ రూ.1లక్ష కోట్ల మార్కు దాటిందన్నారు. ఈ పరిశ్రమల్లో కోటిన్నర మందికి ఉపాధి దొరుకుతోందని పేర్కొన్నారు.

సబర్‌కాంత జిల్లా హిమ్మత్‌నగర్‌ సమీపంలోని సబర్‌ డెయిరీకి సంబంధించిన వివిధ ప్రాజెక్టులను ప్రధాని గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘2014కు ముందు పెట్రోల్‌లో కలిపే ఇథనాల్‌ 40 కోట్ల లీటర్ల కంటే తక్కువగా ఉండేది. చెరుకు, మొక్కజొన్న వంటి వ్యవసాయోత్పత్తుల నుంచి తయారయ్యే ఇథనాల్‌ను పెట్రోల్‌తో కలపాలనే తమ ప్రభుత్వ నిర్ణయంతో నేడది 10% మేర పెరిగి 400 కోట్ల లీటర్లకు చేరుకుందని ఆయన చెప్పారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top