గుడ్ న్యూస్ : మూడు రోజుల్లోనే పీఎఫ్ అమౌంట్ విత్ డ్రా

EPF Withdrawal: How To Do PF Withdrawal Claim Online  - Sakshi

ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) పీఎఫ్ అమౌంట్ విత్ డ్రా విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. పీఎఫ్ ఖాతా నుంచి డబ్బును విత్ డ్రా చేసుకునే వారికి కేవలం మూడు రోజుల్లోనే వారి ఖాతాలో జమ అయ్యే విధంగా ఈపీఎఫ్ క్లెయిమ్ లో మార్పులు చేసింది. ప్రస్తుతం కరోనా పరిస్థితులలో నేపథ్యంలో పీఎఫ్ విత్ డ్రా చేసుకునేందుకు అనుమతించేలా గతేడాది మాదిరిగా కేంద్రం కొన్ని మార్పులు చేసింది. కరోనా మహమ్మారి సమయంలో ప్రజలు ఎదుర్కోంటున్న ఇబ్బందుల నేపథ్యంలో ఈపీఎఫ్ఓ ఈ సదుపాయాన్ని అందిస్తోంది. 

ఇంతకముందు పీఎఫ్ క్లెయిమ్ చేసుకున్న 15 నుంచి 30 రోజుల్లో ఖాతాలో జమ అయ్యేవి. ఆన్ లైన్ లో పీఎఫ్  అమౌంట్ విత్ డ్రా కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఆన్‌లైన్ పీఎఫ్ అమౌంట్ విత్ డ్రా చేయాలంటే కచ్చితంగా ఆధార్, పాన్, బ్యాంక్ ఖాతాతో లింక్ చేసిన యాక్టివ్ గా ఉన్న క్రియాశీల యూఏఎన్ అవసరం. అలాగే, పీఎఫ్ మీ ఆధార్, యుఏఎన్‌ ఖాతాకు జత చేసిన మొబైల్ నంబర్ పనిచేయాలి.

ఆన్‌లైన్‌లో పీఎఫ్ అమౌంట్ ఎలా విత్ డ్రా చేయాలి?

  • ముందుగా యూఏఎన్ UAN, పాస్ వర్డ్ నంబర్ ఉపయోగించి ఈపీఎఫ్ఓ ఖాతాకు లాగిన్ అవ్వాలి.
  • 'ఆన్‌లైన్ సర్వీసెస్' టాబ్‌కు వెళ్లి 'క్లెయిమ్ (ఫారం -31, 19, 10సీ) ఆప్షన్ క్లిక్ చేయాలి. 
  • మీ పీఎఫ్/ ఈపీఎఫ్ ఖాతా వివరాలు కంప్యూటర్ మానిటర్‌లో కనిపిస్తాయి. మీ బ్యాంక్ ఖాతా నంబర్ చివరి నాలుగు అంకెలను నమోదు చేసి, 'వేరిఫై' బటన్ మీద క్లిక్ చేయాలి.
  • టర్మ్స్ అండ్ కండిషన్స్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత 'ప్రొసీడ్ క్లెయిమ్ ఆన్‌లైన్' బటన్ ని ప్రెస్ చేయాలి. 
  • "పీఎఫ్ అడ్వాన్స్ (ఫారం 31)" ఎంచుకోండి, పీఎఫ్ అమౌంట్ విత్ డ్రా ఎందుకు చేస్తున్నారో తెలియజేయాలి.
  • తర్వాత మీకు కావాల్సిన అమౌంట్ ఎంటర్ చేసి.. అడ్రస్ ఎంటర్ చేయాలి.
  • ఇప్పుడు మీ బ్యాంక్ ఖాతా వివరాలను నింపి, బ్యాంక్ ఖాతా చెక్కును అప్‌లోడ్ చేయండి.
  • 'సెండ్ ఓటీపీ' ఆప్షన్ పై క్లిక్ చేయండి. 
  • స్వీకరించిన ఓటీపీని సమర్పించిన తర్వాత ఆన్‌లైన్‌లో మీ పీఎఫ్ దావా నమోదు అవుతుంది.

మీ పీఎఫ్ అమౌంట్ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయడానికంటే ముందు మీ యజమాని విత్ డ్రా పర్మిషన్ అవసరమని ఈపీఎఫ్ఓ సభ్యుడు గమనించాలి. మీ యజమాని ఒకే చేసిన తర్వాత మీరు ఇచ్చిన బ్యాంక్ ఖాతాలోకి నగదు బదిలీ చేస్తారు. అత్యవసర పరిస్థితులలో ఆటో క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రాసెస్ ను సెలక్ట్ చేసుకోవాలి. దీంతో మూడు రోజుల్లో డబ్బు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇందుకోసం దరఖాస్తు చేయడానికి అన్ని కేవైసీ పత్రాలను కలిగి ఉండాలి.

చదవండి: ఈపీఎఫ్: కరోనాతో చనిపోతే క్లెయిమ్ ఎలా చేసుకోవాలి?

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top