Elderly Women Emotional Reunion Viral From Kerala - Sakshi
Sakshi News home page

వీడియో: ఆ చిరునవ్వుల స్నేహానికి 80 ఏళ్లు.. వాళ్లకింకా వయసైపోలేదు! భావోద్వేగంగా..

Nov 29 2022 4:42 PM | Updated on Nov 29 2022 6:12 PM

Elderly Women Emotional Reunion Viral From Kerala - Sakshi

మనవడా.. నా చిన్నప్పటి ఫ్రెండ్‌ను కలవాలని ఉంది రా అంటూ అడిగిన బామ్మకు.. 

వైరల్‌: వయసు ఒంటికే.. మనస్సుకు ఎంతమాత్రం కాదు. ఇక్కడ అదే నిరూపించారు ఇద్దరు బామ్మలు. వాళ్లిద్దరి స్నేహానికి ఎనభై ఏళ్లు పూర్తయ్యాయి. కలుసుకుని చాలా ఏండ్లే అవుతోందట. తన బాల్య స్నేహితురాలిని ఎలాగైనా కలవాలని ఉందని తన మనవడితో చెప్పుకుంది ఆమె.

వీడియో కాల్స్‌ జమానాలో ఆ మనవడు తల్చుకుంటే ఆమె కోరిక క్షణాల్లోనే తీరిపోయేది. కానీ, అతను అలా చేయలేదు. దగ్గరుండి ఆమెను స్నేహితురాలి ఇంటికి తీసుకెళ్లాడు. ఒంట్లో ఓపిక లేకున్నా తన స్నేహితురాలిని చూసే సరికి అవతల ఉన్న బామ్మ ఓపిక తెచ్చుకుంది. లేచి కూర్చుని ఆశ్చర్యపోయింది. 

ఆప్యాయంగా ముచ్చట్లతో మొదలైన వాళ్ల సంభాషణ.. జ్ఞాపకాల్ని నెమరేసుకుంటూ.. పాత రోజుల్లోకి వెళ్లింది. ఇద్దరూ హుషారుగా జోకులేసుకున్నారు. అలా చాలాసేపు గడిచాక.. వెళ్లే ముందు తన స్నేహితురాలి కాలిని ముట్టుకుని ఆశీర్వాదం తీసుకుంది. ముకిల్‌ మీనన్‌ అనే యువకుడు తన బామ్మ కోసం ఇదంతా చేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన వాళ్లిద్దరి రీయూనియన్‌ పోస్ట్‌ అమితంగా ఆకట్టుకుంటోంది.

బాల్యం అద్భుతమైంది. అందులోని స్నేహాలు ఎంతో మధురమైనవి. ఏళ్లు గడిచిన.. ఆ జ్ఞాపకాలు, అప్పటి చిలిపి చేష్టలు ఎప్పుడూ పదిలంగా ఉండిపోతాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement