ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది మృతి | 8 People Died At Madya Pradesh Road Accident | Sakshi
Sakshi News home page

ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది మృతి

May 16 2024 9:17 AM | Updated on May 16 2024 9:45 AM

8 People Died At Madya Pradesh Road Accident

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని వాహనం మహీంద్రా ఎస్‌యూవీను ఢీకొన్న ఘటనలో ఎనిమిది మంది మృతిచెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో, స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.

ఈ ఘటనపై అడిషనల్‌ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఏఎస్పీ) రూపేష్ కుమార్ ద్వివేది తెలిపిన వివరాల ప్రకారం.. ఇండోర్‌ జిల్లాలోని ఇండోర్‌-అహ్మాదాబాద్‌ జాతీయ రహదారిపై ఘటాబిల్లోడ్‌ సమీపంలో రెండు వాహనాలు ఢీకొన్నట్టు ఓ వ్యక్తి ఫోన్‌ చేసి చెప్పారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

 

 

ఈ ప్రమాదంలో వాహనంలో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది మృతిచెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. అతడికి ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. అయితే, ప్రమాదం జరిగిన అనంతరం గుర్తు తెలియని వాహనం డ్రైవర్‌ ఘటనా స్థలం నుంచి పారిపోయాడని చెప్పారు.  మృతదేహాలకు పోస్టుమార్టం జరుగుతుండగా.. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ఇక, సదరు వాహనం గునా అనే ప్రాంతానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు గుర్తించారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement