ED: లాలూ, తేజస్వీలకు మళ్లీ ఈడీ నోటీసులు | ED Issues Fresh Summons To Lalu Prasad, Son Tejashwi Yadav In Money Laundering Case - Sakshi
Sakshi News home page

లాలూ, తేజస్వీలకు మళ్లీ ఈడీ నోటీసులు

Jan 19 2024 8:14 PM | Updated on Jan 19 2024 8:23 PM

Ed Notices To Lalu Prasad And Tejaswi yadav again - Sakshi

పాట్నా: బీహార్‌ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌, ఆయన తండ్రి, మాజీ సీఎం ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌లకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) మరోసారి సమన్లు జారీ చేసింది.  భూములు రాయించుకుని రైల్వే ఉద్యోగాలు ఇచ్చారని తండ్రీ కొడుకులపై మనీ లాండరింగ్‌ కేసు నమోదైంది.

ఈ కేసులో ఈడీ లాలూ, తేజస్వీలను విచారించనుంది.  విచారణ కోసం పాట్నాలోని తమ కార్యాలయానికి రావాలని సమన్లలో ఈడీ తెలిపింది. జనవరి 29న లాలూ ప్రసాద్‌యాదవ్‌, 30న తేజస్వీ యాదవ్‌ తమ ఎదుట విచారణకు హాజరు కావాలని కోరింది.

ఇదే కేసులో వీరిద్దరికి గత  డిసెంబర్‌లో సమన్లు జారీ చేసినా విచారణకు వారు దూరంగా ఉన్నారు. యూపీఏ వన్‌  ప్రభుత్వంలో లాలూ కేంద్ర రైల్వేమంత్రిగా ఉన్న సమయంలో ఈ కుంభకోణానికి పాల్పడ్డారనేది ఈడీ అభియోగం. 

ఇదీచదవండి.. జెండాల గౌరవం కాపాడండి 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement