Rajya Sabha Elections: 57 రాజ్యసభ స్థానాలకు షెడ్యూల్‌ విడుదల

EC Released Elections For 57 Rajya Sabha Seats Notification - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: పెద్దల సభకు ఎన్నికల నగారా మోగింది. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో.. 57 రాజ్యసభ సీట్లకు ఎన్నికలకు గురువారం షెడ్యూల్‌ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం.  ఖాళీకానున్న రాజ్యసభ సీట్ల కోసం మే 24న నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు. 

నామినేషన్ల స్వీకరణకు తుది గడువు మే 31వ తేదీగా నిర్ణయించింది ఈసీ. జూన్ 1వ తేదీన నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు జూన్ 3 వరకు గడువు ఉంటుంది. జూన్ 10న ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. అదే రోజు కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తారు. 

మొత్తం 57 సీట్లలో.. ఆంధ్ర ప్రదేశ్‌ నుంచి నాలుగు, తెలంగాణ నుంచి రెండు సీట్లు భర్తీ చేయాల్సి ఉంది.  ఏపీ నుంచి ఎంపీలు విజయసాయిరెడ్డి, సురేష్ ప్రభు, టీజీ వెంకటేష్, సుజనా చౌదరిల పదవీకాలం ముగియనుంది. అలాగే తెలంగాణ నుంచి కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు,  ధర్మపురి శ్రీనివాస్‌లు రిటైర్‌ అవుతున్నారు.

చదవండి: నూతన ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా రాజీవ్‌కుమార్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top