మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో భూకంపం | Earthquake in Maharashtra Palghar Hits Magnitude 3.7 On Richter Scale | Sakshi
Sakshi News home page

మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో భూకంపం

Jun 24 2021 3:50 PM | Updated on Jun 24 2021 3:57 PM

Earthquake in Maharashtra Palghar Hits Magnitude 3.7 On Richter Scale   - Sakshi

ముంబై: మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో గురువారం భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై 3.7 తీవ్రతతో నమోదైనట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ తెలిపింది. కాగా భూకంపంతో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందనే దానిపై నివేదికలు అందలేదని పేర్కొంది. నాసిక్‌కు 87 కిలోమీటర్ల దూరంలో, భూమికి ఐదు కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది. ఈ నెల 21న అసోం నాగాన్‌లోనూ భూమి కంపించింది. రిక్టర్‌ స్కేల్‌పై 2.8 ప్రకంపనలు వచ్చాయి. తేజ్‌పూర్‌కు 18 కిలోమీటర్ల దూరంలో, భూమికి 15 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement