విద్యార్థులు, నిరుద్యోగులకు డీఆర్‌డీఓ శుభవార్త

DRDO Announces Online Courses On AI, ML and Cybersecurity - Sakshi

న్యూఢిల్లీ: విద్యార్థులు, నిరుద్యోగులకు డీఆర్‌డీఓ శుభవార్త తెలిపింది. భారత ప్రభుత్వ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్‌డీఓ), డీమ్డ్ విశ్వవిద్యాలయం ఆద్వర్యంలో స్వల్ప కాలనికి రెండు షార్ట్‌ టర్మ్ ఆన్‌లైన్‌ కోర్సులను ప్రారంభిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్‌), సైబర్ సెక్యూరిటీపై రెండు స్వల్పకాలిక ఆన్‌లైన్ కోర్సులను ప్రారంభించింది. ఈ రెండు కోర్సులు 12వారాల పాటు కొనసాగుతాయి. వారంలోని ఐదు రోజులలో రోజుకి రెండు గంటల చొప్పున ఈ ఆన్‌లైన్ క్లాస్ నిర్వహించనున్నారు.(చదవండి: వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్‌)

ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష ఆధారంగా అభ్యర్థుల ఎంపిక అనేది ఉంటుంది. గ్రాడ్యుయేట్‌ విద్యార్థులు ఈ కోర్సులలో ఏదైనా స్ట్రీమ్‌లో ప్రవేశం పొందవచ్చు. డిగ్రీ ఫైనల్‌ చదువుతున్న విద్యార్థులు కూడా ప్రవేశపరీక్షకు హాజరయ్యేందుకు తమ పేర్లను రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్ష రుసుము ఉచితం కాగా, ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఒక్కో కోర్సు ధరఖాస్తు కోసం అభ్యర్థులు 15 వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ కోర్సుల ప్రవేశ పరీక్షల కోసం రిజిస్ట్రేషన్ జనవరి 28 నుంచి అధికారిక వెబ్‌సైట్ https://onlinecourse.diat.ac.in/DIATPortal/ ద్వారా ప్రారంభమవుతుంది. ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు అడ్మిషన్ ఫీజును ఫిబ్రవరి 26లోగా చెల్లించాల్సి ఉంటుంది.

డీఆర్‌డీఓ ఆన్‌లైన్ కోర్సుల 2021:

  • రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: జనవరి 28
  • రిజిస్ట్రేషన్ చివరి తేదీ: ఫిబ్రవరి 15
  • ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ప్రవేశ పరీక్ష తేదీ: ఫిబ్రవరి 20
  • సైబర్ సెక్యూరిటీ ప్రవేశ పరీక్ష తేదీ: ఫిబ్రవరి 21 
  • మూడు కోర్సుల ఫలితాలు విడుదల తేదీ: ఫిబ్రవరి 22 
  • రుసుము చెల్లించాల్సిన చివరి తేదీ: ఫిబ్రవరి 26
  • ఆన్‌లైన్ క్లాస్ ప్రారంభ తేదీ: ఫిబ్రవరి 28 
Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top