అవి శ్రద్ధా శరీర భాగాలే

DNA Test Of Shraddha Father Matches With Bones Recovered From Mehrauli Forest - Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన ఢిల్లీ హత్యా ఘటనలో మెహ్రౌలీ అటవీ ప్రాంతంలో లభ్యమైన ఎముకలు శ్రద్ధా వాకర్‌వేనని పోలీసు వర్గాలు గురువారం తెలిపాయి. హత్యారోపణలు ఎదుర్కొంటున్న అఫ్తాబ్‌ గది నుంచి సేకరించిన రక్తం నమూనాలు శ్రద్ధవేనని తేలింది. ఎముకలు, రక్తం నుంచి సేకరించిన డీఎన్‌ఏ నమూనాలు శ్రద్ధా వాకర్‌ తండ్రి డీఎన్‌ఏతో సరిపోలాయని ఆ వర్గాలు వివరించాయి.

డీఎన్‌ఏ రిపోర్టుతోపాటు సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీ నివేదిక అందిందని స్పెషల్‌ పోలీస్‌ కమిషనర్‌(శాంతిభద్రతలు) సాగర్‌ప్రీత్‌ హూడా మీడియాకు తెలిపారు. అఫ్తాబ్‌కు నిపుణులు నిర్వహించిన పాలీగ్రాఫ్‌ పరీక్ష నివేదిక కూడా బుధవారం పోలీసులకు అందింది. కేసు దర్యాప్తులో ఈ నివేదికలు కీలకంగా మారాయి. శ్రద్ధావాకర్‌తో సహజీవనం చేస్తున్న అఫ్తాబ్‌ పూనావాలా ఆమెను గొంతుపిసికి చంపిన అనంతరం శరీరాన్ని 35 భాగాలుగా నరికి వేర్వేరు ప్రాంతాల్లో పడవేశాడు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top