డిజిటల్‌ లావాదేవీలు.. రోజుకు రూ. 20వేల కోట్లు

Digital transactions helping boost facilities, encourage honesty - Sakshi

న్యూఢిల్లీ: దేశంలో రోజుకు రూ. 20వేల కోట్ల విలువైన డిజిటల్‌ లవాదేవీలు జరుగుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. డిజిటల్‌ లావాదేవీలు సౌకర్యవంతమైనవే కాకుండా వీటివల్ల నిజాయితీతో కూడిన వ్యాపార వాతావరణం పెరుగుతోందన్నారు. ఆదివారం ఆయన మన్‌ కీ బాత్‌లో ప్రసంగించారు. చిన్న చిన్న ఆన్‌లైన్‌ పేమెంట్లు భారీ డిజిటల్‌ ఎకానమీ నిర్మాణానికి ఉపయోగపడుతున్నాయని, ఫిన్‌టెక్‌ స్టార్టప్స్‌ ముందుకు వస్తున్నాయని తెలిపారు. డిజిటల్‌ చెల్లింపుల అనుభవాలను ఇతరులతో పంచుకోవాలని ప్రజలను కోరారు.

మార్చిలో యూపీఐ లావాదేవీలు రూ. 10 లక్షల కోట్లను చేరాయని చెప్పారు. పలు రంగాల్లో దివ్యాంగులు తమ సత్తా చాటుతున్నారని ప్రశంసించారు. రాబోయే పండుగల సందర్భంగా ప్రజలంతా కోవిడ్‌ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఎండాకాలంలో నీటి సంరక్షణ అవసరాన్ని ఆయన గుర్తు చేశారు. పరీక్షాపే చర్చలో కొందరు పిల్లలకు లెక్కల గురించి కొంచెం భయమున్నట్లు గమనించానని, గణితశాస్త్రంలో మన దేశానికి ఎంతో జ్ఞానం ఉందని చెప్పారు. భారత్‌ సున్నాను ప్రపంచానికి గుర్తు చేసిందని, మన విజ్ఞానంలో గణితం ఒక భాగమని, అందువల్ల లెక్కల గురించి భయపడవద్దని పిల్లలకు సూచించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top