అరవింద్‌ కేజ్రీవాల్‌ కార్యాలయంలోని డిప్యూటీ సెక్రటరీపై వేటు

Delhi Lt Governor Ordered Suspension Deputy Secretary In Arvind Kejriwals Office - Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా అవినీతి ఆరోపణలతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కార్యాలయంలోని డిప్యూటీ సెక్రటరీ, ఇద్దరు సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్‌డిఎం)లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేస్తున్న ప్రకాశ్‌ చంద్ర ఠాకూర్‌, డివిజన్‌ మేజిస్ట్రేట్‌లు వసంత్‌ విహార్‌ హర్షిత్‌ జైన్‌, వివేక్‌ విహార్‌ దేవేందర్‌ శర్మలపై వేటు విధించడమే కాకుండా క్రమశిక్షణా చర్యలకు ఆదేశించారు. అలాగే ఆయన ఈడబ్ల్యూఎస్ ఫ్లాట్‌ల నిర్మాణంలో లోపాలను గుర్తించి ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ (డీడీఏ)కి చెందిన ఇద్దరు అసిస్టెంట్ ఇంజనీర్లను కూడా సస్పెండ్‌ చేశారు.

ఆయన దేశ రాజధానిలో శాంతి భద్రతలు, క్రైమడేటా విశ్లేషణ నివారణ చర్యల్లో ఢిల్లీ పోలీసు విభాగం పనితీరుని సమీక్షించారు. అంతేకాదు పోలీస్ స్టేషన్ స్థాయిలో పిసిఆర్ దర్యాప్తు , శాంతిభద్రతల రక్షణలోనూ, మహిళల భద్రత కోసం చేస్తున్న కార్యక్రమాలు, యువా ద్వారా అందిస్తున్న  నైపుణ్య శిక్షణ తదితర విషయాల్లో ఢిల్లీ పోలీసులు తీసుకుంటున్న చర్యలను ప్రశంసించారు. కేసులను సకాలంలో దర్యాప్తు చేయాలని సాక్ష్యాధారాలను సాద్యమైనంత తొందరగా సేకరించాలని నొక్కిచెప్పారు.  

(చదవండి: ప్లీజ్..కొంచెం సమయం ఇవ్వండి: ఈడీని కోరిన సోనియా)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top