వీడియో: ఢిల్లీ-హైదరాబాద్‌ ఫ్లైట్‌లో సిబ్బందితో ప్యాసింజర్‌ వికృత చేష్టలు?!

Delhi Hyd SpiceJet Passenger Deboarded Misbehaving With Crew - Sakshi

ఢిల్లీ: ఎయిరిండియా మూత్రవిసర్జన ఘటన మరిచిపోక ముందే.. మరో ప్రయాణికుడి వికృత చేష్టల వ్యవహారం?! వెలుగు చూసింది. ఢిల్లీ-హైదరాబాద్‌కు చెందిన స్పైస్‌జెట్‌ విమానంలో ఇవాళే(సోమవారం)  ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. 

స్పైస్‌జెట్‌ విమానం ఎస్‌జీ-8133.. ఢిల్లీ నుంచి బయలుదేరాల్సి ఉంది. ఆ సమయంలో ఓ ప్యాసింజర్‌ క్యాబిన్‌ సిబ్బందిలోని ఓ యువతితో అనుచితంగా ప్రవర్తించాడు.యువతిని అసభ్యంగా తాకినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె అతనితో వాగ్వాదానికి దిగింది. ఆ సమయంలో తోటి సిబ్బంది ఆ యువతికి మద్ధతుగా వచ్చారు. కాసేపటికి ఈ విషయాన్ని పైలట్‌ ఇన్‌ కమాండ్‌, సెక్యూరిటీ స్టాఫ్‌కు సిబ్బంది తెలియజేశారు. 

దీంతో.. ఆ ప్రయాణికుడిని, అతనితో ఉన్న మరో ప్యాసింజర్‌ను దించేశారు. వారిని భద్రతా సిబ్బందికి అప్పజెప్పినట్లు స్పైస్‌జెట్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రయాణికుడి నుంచి క్షమాపణ పత్రం తీసుకున్నప్పటికీ.. వ్యవహారం ముదరకుండా ఉండేందుకు వాళ్లను దించేసినట్లు తెలుస్తోంది. అయితే తోటి ప్రయాణికుల్లో కొందరు మాత్రం అది కావాలని జరిగిన ఘటన కాదని, ఇరుకుగా ఉండడంతో పొరపాటున తగిలాడనని చెప్తుండడం గమనార్హం.

మరిన్ని వార్తలు :

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top