హెల్త్‌ వర్కర్‌తో అనుచిత ప్రవర్తన.. ఒక్కసారిగా షాకైన మహిళ! | Youth Forcibly Kissing Health Worker In Bihar Jamui | Sakshi
Sakshi News home page

Viral Video: హెల్త్‌ వర్కర్‌తో అనుచిత ప్రవర్తన.. ఒక్కసారిగా షాకైన మహిళ!

Mar 13 2023 11:52 PM | Updated on Mar 14 2023 12:01 AM

Youth Forcibly Kissing Health Worker In Bihar Jamui - Sakshi

ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఓ హెల్త్‌ వర్కర్‌ను గుర్తు తెలియని యువకుడు వేధింపులకు గురిచేశాడు. ఆసుపత్రిలో ఫోన్‌ మాట్లాడుతున్న మహిళను వెనుక వచ్చి బలవంతంగా కౌగిలించుకుని, ముద్దుపెట్టుకుని వేధించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక, బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. 

వివరాల ప్రకారం.. బీహార్‌లోని జముయ్‌ జిల్లాలో బాధితురాలు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరోగ్య కార్యకర్తగా విధులు నిర్వహిస్తోంది. కాగా, ఈనెల 10వ తేదీన ఆమె విధుల్లో ఉన్న సమయంలో ఫోన్‌ మాట్లాడుతున్న క్రమంలో ఓ యువకుడు అనుచితంగా ప్రవర్తించాడు. వెనుక నుంచి వచ్చి ఆమెను బలవంతంగా ముద్దుపెట్టి, కౌగిలించికున్నాడు. ఈ క్రమంలో బాధితురాలు విడిపించుకునే ప్రయత్నం చేసింది. దీంతో, వెంటనే నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. అనంతరం, ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

ఈ సందర్బంగా బాధితురాలు మాట్లాడుతూ.. అతనెవరో నాకు తెలియదు. నన్ను మానసికంగా హింసించాడు. ఆసుపత్రి కాంపౌండ్‌ గోడ దూకి ఎందుకు వచ్చాడు. అతడు నాతో తప్పుగా ప్రవర్తించినప్పుడు నేను ప్రతిఘటించాను. వెంటనే నా చేతిలో నుంచి తప్పించుకున్నాడు. ఇంతలో ఆసుపత్రి సిబ్బందిని పిలిచాను. కానీ, గోడ దూకి అతను పారిపోయాడు. దీనికి కారణమైన అతడిని పట్టుకుని కఠినంగా శిక్షించాలి. సరిహద్దు గోడ చాలా చిన్నదిగా ఉంది. ముళ్ల కంచె వేసి ఆసుపత్రికి తరచుగా వచ్చే మహిళలను రక్షించాలని అధికారులను అభ్యర్థిస్తున్నాను అని తెలిపారు. ఇక, బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్టు స్థానిక పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

వీడియో కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement