Yaas Cyclone: మూడు లక్షల ఇళ్లు ధ్వంసం

Cyclone Yaas Severely affect On Bengal  - Sakshi

బెంగాల్‌లో కోటిమందిపై ప్రభావం చూపిన యాస్‌ తుపాను

తుపానుతో తీవ్రంగా నష్టపోయామన్న సీఎం మమత బెనర్జీ

కోల్‌కతా:యాస్‌ తుపాను పశ్చిమ బెంగాల్‌కు అపార నష్టం చేసిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమత బెనర్జీ అన్నారు. తుపాను దాదాపు కోటి మందిపై ప్రభావం చూపినట్టు ఆమె వివరించారు. వాతావరణ శాఖ హెచ్చరికలను అనుసరించి ముందస్తుగా దాదాపు 15 లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని.. ఐతే భారీ ఆస్తి నష్టం  తప్పలేదన్నారు మమత.

మూడు లక్షల ఇళ్లు ధ్వంసం
ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం యాస్‌ తుపాను  వల్ల రాష్ట్రంలో ఒకరు మరణించగా సుమారు మూడు లక్షల ఇళ్లు ధ్వంసమయ్యాయని ఆమె తెలిపారు. తుపాను తీవ్రత ఎక్కువగా ఉన్న పర్బా మిడ్నాపూర్, దక్షిణ, ఉత్తర పరగణాల జిల్లాల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నట్టు సీఎం తెలిపారు. ఇప్పటికే తుపాను ప్రభావిత ప్రాంతాలకు కోటి రూపాయల విలువైన సహాయక సామగ్రిని పంపించినట్టు ఆమె పేర్కొన్నారు. ఇక తుపాను తీరం దాటిన ఒడిషాలోని దమ్రా, దక్షిణ బహనాగా ప్రాంతాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది.
అల్లకల్లోలం
పౌర్ణమి , చంద్ర గ్రహణం ఏర్పడిన రోజే యాస్‌ తుపాను తీరం దాటింది. దీంతో తుపాను తీవ్రత అధికంగా ఉంది. సముద్రం గతంలో ఎన్నడూ లేనంత అల్లకల్లోలంగా మారింది. రెండు మీటర్ల ఎత్తులో రాకాసి అలలు తీరంపై విరుచుకుపడుతున్నాయి. ఒడిషా, బెంగాల్‌ తీరంలో సముద్రం చాలా చోట్ల పది మీటర్ల వరకు ముందుకు వచ్చింది

చదవండి: yaas cyclone: బురదలో చిక్కుకున్న వందమంది
yass cyclone పట్టపగలే చిమ్మ చీకట్లు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top