డీవీడి రైటర్‌లో రూ. 40 లక్షలు ఖరీదు చేసే బంగారం

The Customs Said15 Mobile Phones And 9 Thousand Foreign Cigarettes - Sakshi

చెన్నై: అంతర్జాతీయ విమానాశ్రయంలో రెండు వేర్వేరు ఘటనల్లో దాదాపు 40 లక్షలు ఖరీదు చేసే బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్‌ అధికారలు తెలిపారు. ఈ మేరకు అక్టోబర్‌ 29న దుబాయ్‌ నుంచి వచ్చిన ఒక ప్రయాణికుడు బ్యాగ్‌లో ఉంచిన పోర్టబుల్‌ డిజిటల్‌ వీడియో డిస్క్‌(డీవీడీ) రైటర్‌లో దాచిన బంగారు కడ్డీలను అధికారులు గుర్తించారు.

ఆ బ్యాగ్‌ను మరింతగా చెక్‌ చేయగా సుమారు 15 మొబైల్‌ ఫోన్లు, దాదాపు 9 వేల విదేశీ సిగరెట్లు లభించినట్లు కస్టమ్స్‌ అధికారులు వెల్లడించారు. మరోక ఘటనలో దుబాయ్‌ నుంచి వచ్చిన మరో ప్రయాణికుడు ఏకంగా పేస్ట్‌ రూపంలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా ఇద్దరు ప్రయాణకుల నుంచి దాదాపు రూ. 40 లక్షలు విలువ చేసే 900 గ్రాముల బంగారం, మొబైల్‌ ఫోన్‌లు, సుమారు రూ. 3.15 లక్షలు విలువ చేసే విదేశీ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. సదరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు. 

(చదవండి: యమునా నదిపై ఎంపీ సంచలన వ్యాఖ్యలు... ప్రూవ్‌ చేసిన అధికారి)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top