Kodagu: Cricket Fan Dies After India Loses Match - Sakshi
Sakshi News home page

Ind Vs Pak: భారత్‌ ఓటమి... గుండెపోటుతో అభిమాని మృతి 

Oct 26 2021 8:10 AM | Updated on Oct 26 2021 10:00 AM

Cricket Fan Dies After India Loses Match in Kodagu - Sakshi

సాక్షి, బెంగళూరు (యశవంతపుర): టీ 20 ప్రపంచ కప్‌లో భారత్‌ ఓటమి చెందడంతో ఓ అభిమాని గుండెపోటుతో మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళ్తే.. కొడగు జిల్లా సోమవారపేట తాలూకా దొడ్డబళె గ్రామానికి ఉదయ్‌ (50) క్రికెట్‌ అభిమాని. ఆదివారం రాత్రి జరిగిన భారత్‌–పాకిస్తాన్‌ మ్యాచ్‌ తిలకిస్తూ భారత్‌ ఓటమి అంచున ఉండటంతో ఉదయ్‌ తీవ్ర ఒత్తిడికి గురికావడంతో గుండెపోటు వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు.  

కాగా, ఆదివారం జరిగిన పోరులో టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. అనంతరం 152 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్తాన్‌ ఏ మాత్రం తడబాటు లేకుండా, వికెట్‌ నష్టపోకుండా అలవోకగా విజయాన్ని అందుకుంది. 

చదవండి: (నేరగాడిగా చిత్రీకరించే ఆ వ్యాఖ్యలు నొప్పించాయి: విజయ్‌ ఆవేదన)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement