దేశంలో తగ్గిన వ్యాక్సినేషన్‌..లోపం ఎక్కడ?

Covid Vaccination Drive Slow Across In India - Sakshi

ఏప్రిల్‌ నెలలో రోజుకి సగటున 29 లక్షల డోస్‌లు 

మే నెలలో రోజుకి సగటున 18.2 లక్షల డోస్‌లే

ఇప్పటివరకు దేశంలో 20.89 కోట్ల డోస్‌లు వినియోగం

డిసెంబర్‌ కల్లా 108 కోట్ల మందికి వ్యాక్సినేషన్‌ పూర్తి చేస్తామంటున్న కేంద్రం 

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో భయాందోళనలకు కారణమైన కరోనా సంక్రమణను కట్టడి చేసేందుకు జరుగుతున్న వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో వేగం మందగించింది. దేశవ్యాప్తంగా జనవరి 16 నుంచి వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లు ప్రారంభమయ్యాయి. ఆ తరువాత వ్యాక్సినేషన్‌ సగటు వేగం ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌ నెలల్లో ఆశాజనకంగానే కొనసాగింది. అయితే మే నెలలో వ్యాక్సిన్‌ మొదటి డోస్‌ తీసుకున్నవారి సంఖ్య తగ్గింది. ఏప్రిల్‌తో పోలిస్తే మే నెలలో 37% డోస్‌లు తగ్గినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మూడోదశ వ్యాక్సినేషన్‌లో భాగంగా 18–44 ఏళ్ల వయసు వారికి మే 1 నుంచి టీకాలు వేయడానికి కేంద్రం అనుమతించిన విషయం ఇక్కడ గమనార్హం.

అసలు వ్యాక్సిన్‌ లభ్యత ఎంతుందో చూసుకోకుండా.. మూడోదశ ప్రకటించారని, టీకాల ఉత్పత్తే సరిపడా లేని సమయంలో రాష్ట్రాలపై భారం వేసేసి కేంద్ర ప్రభుత్వం చేతులు దులుపుకొందని పలువురు ముఖ్యమంత్రులు విమర్శించిన విషయం తెలిసిందే. వ్యాక్సిన్లకు తీవ్ర కొరత ఏర్పడటంతో పలు రాష్ట్రాలు 18–44 ఏళ్ల వయసుల వారికి టీకాలు ఇచ్చే కార్యక్రమాన్ని వాయిదా వేశాయి. కొన్నిచోట్ల ప్రారంభమయ్యాక కేంద్రాలను మూసివేశాయి. గ్లోబల్‌ టెండర్లకు కూడా వెళ్లాయి. ఏప్రిల్‌తో పోలిస్తే మే నెలలో వ్యాక్సినేషన్‌ గణనీయంగా తగ్గడం రాష్ట్రాల వాదనకు బలం చేకూరుస్తోంది.

జనవరి–ఫిబ్రవరి నెలల్లో మొత్తం 1.42 కోట్ల డోస్‌లు కేంద్రానికి చేరగా, అందులో 1.16 కోట్లు మొదటి డోస్‌లు, 0.26 కోట్లు రెండవ డోస్‌లు వేశారు. మార్చి నెలలో 5.36 కోట్ల వ్యాక్సిన్లు రాగా... రోజుకి 17.3 లక్షల చొప్పున వ్యాక్సిన్లు ప్రజలకు వేశారు. మే నెలలో 8.72 కోట్ల కోవిషీల్డ్, కోవాగ్జిన్‌ వ్యాక్సిన్లు సగటున రోజుకి 29 లక్షల డోస్‌లను అందించారు. అదే మే నెలలో ఇప్పటివరకు 4.56 కోట్ల వ్యాక్సిన్‌ డోస్‌లు రాగా అందులో రోజుకి సగటున 18.2లక్షల వ్యాక్సిన్లు ఇచ్చారు. దీంతో ఇప్పటి వరకు దేశంలో వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో భాగంగా శనివారం ఉదయం వరకు మొత్తం 20,89, 02,445 డోస్‌లు ఇచ్చారు. ఇందులో 16,47,79,253 మొదటి డోస్‌లు ఇవ్వగా, 4,41,23,192 రెండవ డోస్‌లు అందించారు.

మహారాష్ట్రలో అత్యధికం 
రాష్ట్రాల వారీగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ పరిశీలిస్తే, మొదటి, రెండవ డోస్‌లు కలిపి చూస్తే మహారాష్ట్రలో అత్యధికంగా 2.19 కోట్ల డోస్‌లు, ఉత్తర్‌ప్రదేశ్‌లో 1.76కోట్లు, రాజస్థాన్, గుజరాత్‌ల్లో 1.65 కోట్లు, పశ్చిమబెంగాల్‌లో 1.39 కోట్లు వ్యాక్సిన్‌ డోస్‌లు వేశారు. అయితే శుక్రవారం ఒక్కరోజులో దేశంలో మొత్తం 30.62 లక్షల డోస్‌ల వ్యాక్సిన్లు వేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మరోవైపు ఈ ఏడాది డిసెంబరు నాటికి 108 కోట్ల మందికి రెండు డోస్‌ల వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పూర్తిచేసేందుకు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ ఇటీవల ప్రకటించారు.

మారిన విధానం.... 
ఏప్రిల్‌లో కేంద్రం రూపొందించిన విధానం ప్రకారం దేశంలో తయారుచేసిన వ్యాక్సిన్‌ డోస్‌ల్లో సగం మాత్రమే కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసి 45 ఏళ్ల పైబడిన వారికి ఉచితంగా ఇవ్వడానికి రాష్ట్రాలకు సరఫరా చేస్తుంది. మిగిలిన 50 శాతం వ్యాక్సిన్‌ డోస్‌లను రాష్ట్రాలు, ప్రైవేట్‌ ఆసుపత్రులు నేరుగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ విధానంతో పలు రాష్ట్రాల్లో వ్యాక్సిన్ల కొరత ఏర్పడింది. దీంతో మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీతో సహా కొన్ని రాష్ట్రాలు 18–44 సంవత్సరాల మధ్య ఉన్నవారికి వ్యాక్సినేషన్‌ ప్రణాళికను వాయిదా వేశాయి. అంతేగాక వ్యాకిన్ల కొరతను తగ్గించుకొనేందుకు రాష్ట్రాలు విదేశాల నుంచి వ్యాక్సిన్‌లను నేరుగా కొనుక్కోవచ్చని కేంద్రం ఆ భారాన్ని రాష్ట్రాలపై వదిలేసింది. కానీ విదేశీ ఫైజర్, మోడెర్నా వంటి సంస్థలు నేరుగా రాష్ట్రాలకు వ్యాక్సిన్లను విక్రయించలేమని, కేవలం కేంద్ర ప్రభుత్వంతో మాత్రమే తమ చర్చలు కొనసాగుతాయని స్పష్టం చేశాయి.

(చదవండి: రాందేవ్‌ బాబా వ్యాఖ్యలపై 1న దేశవ్యాప్త నిరసన)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

30-05-2021
May 30, 2021, 04:49 IST
గుంటూరు మెడికల్‌: కోవిడ్‌–19 సోకి రోజుల తరబడి ఆస్పత్రుల్లో చికిత్స పొందకుండా కేవలం ఒకే ఒక్క ఇంజక్షన్‌ ద్వారా ఒక్కరోజులోనే...
30-05-2021
May 30, 2021, 04:27 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్‌ చికిత్స అందిస్తున్న ఆస్పత్రుల్లో అగ్ని ప్రమాదాల నివారణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. గతేడాది...
30-05-2021
May 30, 2021, 04:04 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టింది. అన్ని జిల్లాల్లోనూ కేసులు క్రమంగా తగ్గుతున్నట్టు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. తూర్పుగోదావరి,...
30-05-2021
May 30, 2021, 00:54 IST
ప్రస్తుతం కేసులు, మరణాల తగ్గుదలను బట్టి చూస్తే జూన్‌ చివరికల్లా కరోనా నియంత్రణలోకి రావొచ్చు. అయితే లాక్‌డౌన్‌లో ఉన్నపుడు సహజంగానే...
29-05-2021
May 29, 2021, 21:42 IST
బీజింగ్‌: కరోనా మహమ్మారికి పుట్టినిల్లుగా చెప్పుకునే చైనాలోని  గాంజావ్‌ సిటీలో కొత్త రకం స్ట్రెయిన్ దడపుట్టిస్తుంది. మునుపటి స్ట్రెయిన్‌లతో పోల్చితే ఈ స్ట్రెయిన్...
29-05-2021
May 29, 2021, 20:45 IST
లక్నో: కరోనా నుంచి కోలుకున్న ప్రజలను ఫంగస్‌ బయపెడుతుంది. ఇప్పటికే దేశంలో బ్లాక్‌, వైట్‌ ఫంగస్‌ కేసులు రోజురోజుకు పెరుగుతుండగా.....
29-05-2021
May 29, 2021, 19:40 IST
జైపూర్‌: కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు వ్యాక్సిన్‌ ఉత్తమ మార్గమని ప్రభుత్వం చెబుతోంది. అలాంటి వ్యాక్సిన్‌ రెండు డోసుల మధ్య కొన్ని రోజులు...
29-05-2021
May 29, 2021, 18:00 IST
భోపాల్‌: కోవిడ్‌-19ను రాజకీయం చేశారనే ఆరోపణలపై కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు కమల్‌ నాథ్‌పై మే 24న కేసు నమోదైన విషయం...
29-05-2021
May 29, 2021, 17:53 IST
మహబూబాబాద్: ఉపాధి హామీ పనులకు వెళ్లిన బాలికపై దారుణానికి ఒడిగట్టారు మృగాళ్లు. దారికాచి మరీ దాడి చేశారు. అంతటితో ఆగకుండా...
29-05-2021
May 29, 2021, 15:54 IST
ఢిల్లీ: దేశ రాజధానిలో కరోనా కేసులు రోజురోజుకు మరింత తగ్గుతున్నాయి. తాజాగా శనివారం 956 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. సెకండ్‌...
29-05-2021
May 29, 2021, 15:48 IST
సాక్షి, అమరావతి: కరోనా కట్టడి కోసం తీవ్రంగా కృషి చేస్తోన్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పీడియాట్రిక్‌ కోవిడ్‌-19...
29-05-2021
May 29, 2021, 15:08 IST
కారేపల్లి: ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం ముత్యాలగూడెం గ్రామంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. కేవలం 10 రోజుల వ్యవధిలోనే ముగ్గురు...
29-05-2021
May 29, 2021, 14:32 IST
వెబ్‌డెస్క్‌: కరోనా ముప్పు ప్రపంచాన్ని ఇప్పుడప్పుడే వదిలేలా లేదు. ఇప్పటికే కరోనా వేరియంట్స్‌తో అన్ని దేశాలు ఇబ్బందులు పడుతుంటే..... కొత్తగా కరోనా...
29-05-2021
May 29, 2021, 10:05 IST
రోజురోజుకు దేశంలో కరోనా కేసులు, మరణాల సంఖ్య తగ్గుతున్నాయి. కరోనా కట్టడి చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నట్లు కనిపిస్తోంది. మరికొన్నాళ్లు ఇదే...
29-05-2021
May 29, 2021, 04:41 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 12 ఏళ్లలోపు చిన్న పిల్లలకు కోవిడ్‌–19 సోకితే అనుసరించాల్సిన చికిత్సా విధానం, నియంత్రించడం కోసం ఒక...
29-05-2021
May 29, 2021, 04:28 IST
సాక్షి, అమరావతి: దేశంలో అర్హులందరికీ సకాలంలో ఉచితంగా కోవిడ్‌ వ్యాక్సిన్లు వేయాలన్న లక్ష్యానికి ‘ప్రైవేటు సరఫరా’ గండికొడుతోంది. ఉత్పత్తి అవుతున్నవ్యాక్సిన్లలో...
29-05-2021
May 29, 2021, 03:49 IST
ముత్తుకూరు: కరోనా నివారణకు తాను తయారు చేసిన ఆయుర్వేద మందుపై అధ్యయనం జరుగుతుందని, ప్రభుత్వ అనుమతి రాగానే మందు పంపిణీ...
29-05-2021
May 29, 2021, 03:32 IST
సాక్షి, అమరావతి: మానవత్వం మరచి కోవిడ్‌ రోగుల వద్ద అధిక ఫీజులు దండుకునే ప్రైవేటు ఆస్పత్రులపై రాష్ట్ర ప్రభుత్వం కొరడా...
29-05-2021
May 29, 2021, 03:17 IST
ప్రధాని మోదీ ఆడుతున్న నాటకాల వల్లే దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తోందని రాహుల్‌ గాంధీ మండిపడ్డారు.
29-05-2021
May 29, 2021, 03:04 IST
సాక్షి, న్యూఢిల్లీ: కరోనాతో తల్లిదండ్రులిద్దరినీ లేదా   తల్లి, తండ్రిని కోల్పోయిన చిన్నారుల వివరాలు నమోదు చేయాలని సుప్రీంకోర్టు రాష్ట్రాలను ఆదేశించింది....
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top