Corona: పిల్లల్లో కనిపించే లక్షణాలు ఇవే..

Covid Children Symptoms And What Parents Should Know - Sakshi

ఈ లక్షణాలు ఉంటే పిల్లలకు కరోనా సోకినట్లే భావించాలి

న్యూఢిల్లీ: కరోనా మొదటి దశలో పిల్లల్లో ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. గత ఏడాది పిల్లలు, టీనేజర్లు కరోనా బారిన పడిన దాఖలాలు చాలా తక్కువగా కనిపించాయి. కానీ సెకండ్‌ వేవ్‌లో మహమ్మారి పిల్లలను కూడా వదలడం లేదు. చిన్నారులకు కోవిడ్ సోకుతున్న కేసులు ఇటీవల దేశవ్యాప్తంగా భారీగా పెరుగుతున్నాయి. 

కారణమేంటంటే.. 
ఈ ఏడాది ప్రారంభంలో కోవిడ్ కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. దాంతో పిల్లలు బయటకు వెళ్లి ఆడుకోవడం మొదలుపెట్టారు. యువత కాలేజీలు, పాఠశాలలకు వెళ్లారు. ఈ లోపు కరోనావైరస్‌లో కొత్త మ్యుటేషన్లు పుట్టుకొచ్చాయి. బహిరంగ ప్రదేశాల్లో రద్దీ పెరగడం, సామాజిక దూరం పాటించకపోవడం, వైరస్ కొత్త మ్యుటేషన్‌‌లకు వేగంగా సోకే లక్షణం ఉండటం.. కేసుల పెరుగుదలకు కొన్ని కారణాలుగా భావిస్తున్నారు.

కరోనా సోకిన పిల్లల్లో ఉండే లక్షణాలేంటి..
పిల్లల్లో కోవిడ్ లక్షణాలు ఉన్నాయో లేదో.. ఒకవేళ చిన్నారులు మహమ్మారి బారిన పడితే తీసుకోవాల్సిన చర్యల గురించి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అనేక మార్గాలు, మార్గదర్శకాలతో కూడిన జాబితాను విడుదల చేసింది. ఇక మంత్రిత్వ శాఖ ప్రకారం పిల్లల్లో ఎక్కువ మంది లక్షణాలు లేకుండానే మహమ్మారి బారిన పడుతున్నారని.. చాలా తక్కువ కేసుల్లోనే సింప్టమ్స్‌ కనిపిస్తున్నాయని తెలిపింది. 

                                          (ఫోటో కర్టెసీ: ఇండియా టుడే)

పిల్లల్లో జ్వరం, పొడి దగ్గు, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు,రుచి, వాసన కోల్పోవడం, మయాల్జియా(కండరాల నొప్పి, స్నాయువులో నొప్పి), రినోరియా(ముక్కు నుంచి విపరీతంగా నీరు కారడం.. క్రమేణా అది చిక్కని శ్లేష్మంగా మారడం), కొద్ది మంది పిల్లల్లో జీర్ణశయాంతర సమస్యలు కూడా కనిపిస్తున్నాయి. అయితే వీటితో పాటు వాంతులు, విరేచనాలు, తలనొప్పి, ఒళ్లు నొప్పులు ఉంటే కచ్చితంగా కరోనావైరస్ సోకిందని అనుమానించాలి. పసివాళ్లు నొప్పిగా ఉందని చెప్పలేరు కాబట్టి వాళ్లు నిరంతరం ఏడుస్తున్నా, విచిత్రంగా ప్రవర్తిస్తున్నా నొప్పితో బాధపడుతున్నారని అనుమానించాలి.

చికిత్స, ఆస్పత్రికి వెళ్లాల్సిన పరిస్థితులు
సాధారణంగా పిల్లలు కోవిడ్‌ బారిన పడితే త్వరగానే కోలుకుంటారని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక లక్షణాలు కనిపంచని వారిని ఇంట్లోనే ఉంచి చికిత్స అందివ్వాలని.. ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపింది. 

విడవకుండా గొంతు నొప్పి, దగ్గు ఉన్నప్పుడు, తీవ్ర అస్వస్థతకు గురైనప్పుడు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తినా, ఆయసం, ఆక్సిజన్‌ లెవల్స్‌ 90 శాతం కన్నా పడిపోయినా, విడవకుండా వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి ఉంటే వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలి.

                                                      (ఫోటో కర్టెసీ: ఇండియా టుడే)

కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ల్‌లో పైన చెప్పినా లక్షణాలే కాక  ఇతర లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి. చర్మం, పెదవులు, గోళ్లు పాలిపోవడం, చిరాకు పడటం, ఆపకుండా ఏడ్వడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. 

చదవండి: 
పిల్లలకు కరోనా వస్తే.. ఈ మందులు వాడొద్దు
12 ఏళ్లు పైబడిన పిల్లలపై క్లినికల్‌ ట్రయల్స్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

16-05-2021
May 16, 2021, 10:23 IST
దేశంలో కరోనా వైరస్‌ రెండోదశ వ్యాప్తి కొనసాగుతోంది. వరుసగా మూడో రోజు కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి.
16-05-2021
May 16, 2021, 09:41 IST
ఆక్సిజన్‌ అందక ఏ ఒక్కరి ప్రాణం పోకుండా ఉండేందుకు నడుం బిగించారు సోషల్‌ డేటా ఇన్‌షేటివ్స్‌ ఫోరం (ఎస్‌డీఐఎఫ్‌), యాక్సెస్‌...
16-05-2021
May 16, 2021, 07:52 IST
మేడం.... నాకు, నా భార్యకు కోవిడ్‌ వచ్చి తగ్గిపోయింది. ఈ ఉత్తరం మీకు రాసేటప్పటికి తగ్గిపోయి 20 రోజులైంది. దాంపత్య...
16-05-2021
May 16, 2021, 06:31 IST
దేశవ్యాప్తంగా కోవిడ్‌ బాధితుల్లో మ్యుకోర్‌మైకోసిన్‌ అనే అరుదైన ఫంగల్‌ ఇన్ఫెక్షన్‌ కేసులు ఎక్కువగా వెలుగులోకి వస్తుండటంపై ఆందోళన..
16-05-2021
May 16, 2021, 06:24 IST
న్యూఢిల్లీ: కోవిడ్‌–19 వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి సంబంధించి ప్రధాని మోదీ వైఖరిని విమర్శిస్తూ పోస్టర్లు వేశారనే ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు 25...
16-05-2021
May 16, 2021, 06:07 IST
కరోనాకు ముందు డేటింగ్‌ యాప్‌లకు మంచి డిమాండ్‌ ఉండేది. టిండర్‌ లాంటి డేటింగ్‌ యాప్‌ యూజర్లంతా తమ జీవిత భాగస్వామి...
16-05-2021
May 16, 2021, 05:53 IST
నెల్లూరు జిల్లా వరికుంటపాడు వాస్తవ్యులు బొడ్డు నాగలక్ష్మి మనోనేత్రం సామాన్యుల కళ్ల కంటే కరోనా బాధితుల కష్టాలను మరింత చేరువగా...
16-05-2021
May 16, 2021, 05:01 IST
గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు మెరుగుపర్చాలని, ఇంటింటికీ వెళ్లి పరీక్షలు నిర్వహించాలని, లక్షణాలున్న వారిపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని ప్రధానమంత్రి...
16-05-2021
May 16, 2021, 04:54 IST
బ్లాక్‌ ఫంగస్‌.. కోవిడ్‌ బారినపడి చికిత్స పొందుతున్న కొందరిలో తలెత్తుతున్న సమస్య ఇది.
16-05-2021
May 16, 2021, 04:21 IST
కారంపూడి (మాచర్ల): కోవిడ్‌ నుంచి ప్రజలను కాపాడే క్రమంలో తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి నిరంతరం విధుల్లో నిమగ్నమవుతూ...
16-05-2021
May 16, 2021, 03:26 IST
కాప్రా:  కరోనా ఉందనే అనుమానంతో ఆస్పత్రులు చేర్చుకోకపోవడంతో.. ఓ నిండు గర్భిణి అంబులెన్సులోనే మృతి చెందిన ఘటనపై మేడ్చల్‌ మల్కాజిగిరి...
16-05-2021
May 16, 2021, 03:08 IST
సాక్షి, అమరావతి: కరోనా పాజిటివ్‌ కేసుల నేపథ్యంలో పల్లెటూళ్లు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. మే 7వ తేదీ నుంచి...
16-05-2021
May 16, 2021, 03:07 IST
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ దానికదే వ్యాపించడం మొదలైందా? పరిశోధనలు చేస్తుండగా పొరపాటున లీకైందా? ఎవరైనా జన్యుమార్పిడి చేసి జీవాయుధంగా...
16-05-2021
May 16, 2021, 02:52 IST
సాక్షి, హైదరాబాద్‌/ సింగరేణి (కొత్తగూడెం): సింగరేణిలో కోవిడ్‌ను కట్టడి చేసేందుకు సింగరేణి సంస్థ యాజమాన్యం, ప్రభుత్వ యంత్రాంగం, గుర్తింపు యూనియన్‌...
16-05-2021
May 16, 2021, 02:38 IST
 హైదరాబాద్‌ నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్‌ సాగర్‌ జలాల్లో కరోనా వైరస్‌ ఆనవాళ్లు బయటపడడం కలకలం సృష్టిస్తోంది.
16-05-2021
May 16, 2021, 02:10 IST
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రభావంతో ప్రజల షాపింగ్‌ వైఖరిలో గణనీయంగా మార్పులొచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా 17 దేశాలలో మార్కెట్‌...
16-05-2021
May 16, 2021, 01:49 IST
రష్యాలోని గమలేయా సంస్థ అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌–వి వ్యాక్సిన్‌ ఇకపై భారత్‌లోనూ తయారుకానుంది.
16-05-2021
May 16, 2021, 01:41 IST
న్యూఢిల్లీ: హోం ఐసోలేషన్‌లో ఉన్న కరోనా పేషెంట్లు రెమిడెసివిర్‌ ఇంజక్షన్‌ను తీసుకోవద్దని, ఆక్సిజన్‌ స్థాయి 94కు తగ్గితే వెంటనే ఆసుపత్రిలో...
16-05-2021
May 16, 2021, 01:31 IST
కరోనా కల్లోలంతో కుటుంబాలు చితికిపోతున్నాయి. ఇన్నాళ్లూ సంతోషంగా గడిపిన కుటుంబాలు అతలాకుతలం అవుతున్నాయి. ఇంటికి ఆధారమైన కుటుంబ పెద్దను కోల్పోయిన ఆవేదన ఓ వైపు.....
16-05-2021
May 16, 2021, 00:39 IST
ముంబై : ముంబై మహా నగరంలో కరోనా క్రమక్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఆదివారం ముంబైలో 1,450 కేసులు మాత్రమే నమోదయ్యాయి....
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top