కర్ణాటక: విధాన సభను గోమూత్రంతో శుభ్రం చేసిన కాంగ్రెస్‌ కార్యకర్తలు.. ఎందుకంటే!

Congress Karyakartas Clean Vidhana Soudha Cow Urine For Bjp Corruption Ends Karnataka - Sakshi

బెంగళూరు: కర్ణాటక ప్రజలు అధికార బీజేపీకి షాక్కిస్తూ ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీకి ఘన విజయాన్ని అందించారు. సిద్ధ‌రామ‌య్య ముఖ్యమంత్రిగా ప‌గ్గాలు చేప‌ట్టిన అనంత‌రం కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు విధాన సౌధ ప్రాంగ‌ణాన్ని గోమూత్రంతో శుభ్రం చేశారు. బీజేపీ అవినీతి పాల‌న‌ అంతమైంది కాబట్టే తాము ఈ కార్య‌క్ర‌మం చేప‌ట్టామ‌ని కార్య‌క‌ర్తలు తెలిపారు.

విధాన సభను శుద్ది చేయాల్సిన అవసరం ఉంది
ఇదిలా ఉండగా కాంగ్రెస్ కర్ణాటక అధ్యక్షుడు డీకే శివకుమార్ గతంలో విధానసౌధ (అసెంబ్లీ)ని గోమూత్రంతో శుభ్రపరచాల్సి ఉందని చెప్పిన సంగతి తెలిసిందే. బీజేపీ హయాంలో అవినీతితో అసెంబ్లీ కలుషితమైందని శివకుమార్ ఆరోపిస్తూ.. శుద్ధి చేసేందుకు తన వద్ద ఆవు మూత్రం కూడా ఉందని చెప్పుకొచ్చారు.  బీజేపీ ప్ర‌భుత్వంలో జరిగిన అవకతవకలు, ప‌లు స్కామ్‌ల వివ‌రాల‌తో కాంగ్రెస్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో వీటిని హైలైట్ చేసింది. వీటితో పాటు ఎన్నికలకు కొన్ని రోజుల ముందు, కాంగ్రెస్ అధికార బీజేపీ ప్రభుత్వం చేసిన వివిధ ‘స్కామ్‌లను’ ఎత్తి చూపుతూ ద్విభాషా ‘అవినీతి రేటు కార్డు’ను రూపొందించింది.

‘అవినీతి రేటు కార్డు’ను ఇంగ్లీషు, కన్నడ భాషల్లో విడుదల చేసింది. ‘అవినీతి కార్డులో సీఎం ఖరీదు రూ.2,500 కోట్లు, మంత్రి పదవి ఖరీదు రూ.500 కోట్లకు బేరం పెట్టినట్లు కాంగ్రెస్ విమర్శించడంతో పాటు వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లింది. బీజేపీ డ‌బుల్ ఇంజిన్ ప్ర‌భుత్వం కాద‌ని ట్ర‌బుల్ ఇంజిన్ ప్ర‌భుత్వమ‌ని.. ఇక కాంట్రాక్టుల‌కు 40 శాతం, కొవిడ్‌-19 స‌ర‌ఫ‌రాల‌కు 75 శాతం వ‌ర‌కూ బీజేపీ నేత‌లు క‌మీష‌న్లు వ‌సూలు చేశార‌ని విమర్శలు గుప్పించింది.

చదవండి: అందుకే రద్దు.. మళ్లీ చలామణిలోకి రూ.1000 నోట్లు? ఆర్బీఐ గవర్నర్‌ క్లారిటీ

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top