వర్క్‌ ఫ్రం హోం, ఆదాయంపై సంచలన సర్వే: దిగ్గజాలు ఇపుడేమంటాయో? | Companies Allowing WFH Show Faster Revenue Growth: Survey | Sakshi
Sakshi News home page

వర్క్‌ ఫ్రం హోం, ఆదాయంపై సంచలన సర్వే: దిగ్గజాలు ఇపుడేమంటాయో?

Published Wed, Nov 15 2023 11:52 AM | Last Updated on Wed, Nov 15 2023 12:51 PM

Companies Allowing WFH Show Faster Revenue Growth Survey - Sakshi

కోవిడ్‌ అనంతరం ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు దాదాపు యథాస్థితికి రావడంతో టెక్‌ దిగ్గజాలన్నీ తమ ఉద్యోగులకు కీలక ఆదేశాలు జారీ చేస్తున్నాయి. ఇక వర్క్‌ ఫ్రం హోం పద్ధతికి గుడ్‌ బై  చెపుతూ ఆఫీసులకు రావాల్సిందే అంటూ  తెగేసి  చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో  వర్క్‌ ఫ్రం హోం విధానం, కంపెనీల  ఆదాయంపై ఒక సర్వే సంచలనంగా మారింది.. ఆ వివరాలు. ఎలా  ఉన్నాయంటే.. 

WFH  ద్వారా పలు కంపెనీలు  వేగవంతమైన ఆదాయ వృద్దిని నమోదు చేశాయని తాజా సర్వేలో తేలింది.  దీంతో పని ప్రదేశాలలో ఉత్పాదకత ,పనితీరుపై చర్చకు ఈ సర్వే మరోసారి తెరలేపింది. రిమోట్ పనిని అనుమతించే కంపెనీలు ఆఫీసు హాజరు విషయంలో మరింత కఠినంగా వ్యవరిస్తున్న కంపెనీలతో పోలిస్తే నాలుగు రెట్లు వేగంగా ఆదాయ వృద్ధిని సాధించాయని ఫ్లెక్స్-వర్క్ అడ్వైజర్ స్కూప్ టెక్నాలజీస్ సంస్థ, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ సంయుక్తంగా చేసిన అధ్యయనంలో  తేలింది.  టెక్నాలజీ నుండి బీమా వరకు 20 రంగాల కంపెనీలో  ఈ సర్వే జరిగింది. (దీపావళి తరువాత పసిడి పరుగు: డాలర్‌ ఢమాల్‌)

554 పబ్లిక్ కంపెనీల్లో  26.7 మిలియన్ల మంది ఉద్యోగులతో ఈ సర్వే నిర్వహించారు. పూర్తిగా రిమోట్ లేదా ఉద్యోగులు కార్యాలయానికి వచ్చినప్పుడు ఎంపికకు అనుమతిచ్చిన కంపెనీల్లో  2020  2022 మధ్య అమ్మకాలు 21శాతం అమ్మకాలు పెరిగాయి. కనీస ఆఫీస్ అటెండెన్స్ అవసరమయ్యే కంపెనీల వృద్ధి , వారంలో కొన్ని రోజుల్లో వచ్చినవి ఆఫీస్ ఫుల్ టైమ్‌లో ఉన్నవాటి కంటే రెండింతలు పెరిగిందని సర్వే తెలిపింది. రిమోట్‌ ఫ్రెండ్లీ  కంపెనీల్లో ఉద్యోగుల అట్రిషన్‌ రేటు తగ్గడంతోపాటు, గ్లోబల్‌గా నియామక అవకాశాలు పెరిగి,  గ్రోత్‌ రేటు వేగం పెరుగుతుందని, స్కూప్ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాబ్ సాడో తెలిపారు. (రిషీ సునాక్‌పై సుయెల్లా బ్రేవర్మన్‌ ధ్వజం: మూడు పేజీల లేఖ కలకలం)

స్కూప్ డేటాబేస్‌లోని 5,565 కంపెనీలలో, పూర్తి-సమయం కార్యాలయంలో పని అవసరమయ్యే  షేర్‌ ఈ ఏడాది ఆరంభంలో 49 శాతంగా ఉండగా, ఇది అక్టోబర్ నాటికి 38 శాతానికి దిగి వచ్చింది.నిర్దిష్ట సంఖ్యలో పని రోజులు అవసరమయ్యే కంపెనీలలో, కేవలం 6 శాతం మందికి నాలుగు రోజులు , చాలా వరకు రెండు లేదా మూడు రోజులు చాలని Scoop-BCG సర్వే కనుగొంది. మెర్సర్ సీనియర్ ప్రిన్సిపాల్ లారెన్ మాసన్  పురుషులతో పోలిస్తే మహిళా ఉద్యోగుల్లో ఫ్లెక్సీ వర్క్‌ పట్ల ఆసక్తి ఎక్కువ ఉంది.

హార్వర్డ్ బిజినెస్ స్కూల్ అసోసియేట్ ప్రొఫెసర్ పృథ్వీరాజ్ చౌదరి చేసిన మునుపటి పరిశోధనలో హైబ్రిడ్ పని కోసం కేవలం ఒకటి లేదా రెండు రోజులు ఆఫీసుకు వస్తే చాలని తేలింది. వర్క్‌ప్లేస్ నిపుణుల అభిప్రాయం ప్రకారం,వ్యక్తిగత బృందాలకు వారు ఎప్పుడు, ఎక్కడ పని చేస్తారనే దానిపై కొంత స్వయం ప్రతిపత్తిని అందించడం మంచి పద్ధతి.   ఇందులో  ఆ కంపెనీ  సీఈవో  సూచించే తప్పనిసరి  విధానం  కంటే, హైబ్రిడ్ పాలసీని సెట్ చేసే టీమ్స్‌ నిర్ణయమే ఉత్తమని  నిపుణుల వాదన.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement