ఈ విషయంలో ప్రధాని మోదీకి కృతజ్ఞతలు: సీఎం జగన్‌

CM YS Jagan At Global Investor Preparatory Conference Updates - Sakshi

UPDATES.. 

►  విశాఖ వేదికగా మార్చిలో జరగబోయే గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ కోసం ఇవాళ ఢిల్లీలో జరిగిన సన్నాహక సమావేశం ముగిసింది.

► ఏపీలో పెట్టుబడులు పెట్టిన వారందరికీ కృతజ్ఞతలు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు మా వంతు సహకారం అందిస్తాము. ప్రపంచవేదికపై ఏపీని నెలబెట్టడానికి మీ సహకారం మాకు అవసరం. ఈ విషయంలో ప్రధాని మోదీకి కృతజ్ఞతలు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌లో గత మూడేళ్లుగా ఏపీ నంబర్‌ వన్‌గా ఉంది. పరిశ్రమల స్థాపనకు మేము చేస్తున్న కృషితో పాటు పారిశ్రామిక వేత్తలు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌తోనే మేము నంబర్‌ వన్‌గా ఉన్నాము. ఏపీకి సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది. 11.43 శాతం వృద్ధి రేటుతో దేశంలోనే అత్యంత వేగంగా వృద్ధి చేస్తున్న రాష్ట్రం ఏపీ. 11 ఇండస్ట్రియల్‌ కారిడార్లలో మూడు ఏపీకే రావడం శుభపరిణామం.
- సీఎం వైఎస్‌ జగన్‌. 

► కోవిడ్‌ సమయంలో ఫ్యాక్టరీ ప్రారంభించాము. ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రోత్సాహం అమోఘం. ప్రభుత్వం అహర్నిశలు కృషి చేసింది. మంచి నైపుణ్యం ఉన్న నిపుణులకు ఏపీలో కొదవలేదు. పరిశ్రమల స్థాపనకు సీఎం జగన్‌, మంత్రులు, అధికారుల కృషి అద్బుతం. పెట్టుబడులు పెట్టేవారికి ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఉత్సాహాన్ని ఇస్తున్నాయి.  - బి. సంతానం, సీఈవో ఇండియా సెయింట్‌ గోబైన్‌

స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వడం మా ప్రాధాన్యత. కంపెనీకి ఆపరేషన్‌పై స్థానిక అధికారుల సహకారం బాగుంది. - ఎవర్టన్‌ టీ ఇండియా డైరెక్టర్‌ రోషన్‌ గుణవర్దన

15వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాము. ఏపీ కేంద్రంగా అధునాతన ఉత్పత్తుల ఎగుమతి జరుగుతోంది. - అపాచీ అండ్‌ హిల్టాప్‌ గ్రూప్‌ డైరెక్టర్‌ సెర్జియా లీ

ఏపీలో రూ.వెయ్యి కోట్లతో 2 బిజినెస్‌ యూనిట్లు ప్రారంభించాము. 2030 నాటికి ఉత్పత్తిని రెండింతలు చేస్తాము. -టోరే ఇండస్ట్రీస్‌ ఎండీ యమగూచి. 

ఏపీ ప్రభుత్వం మాకు ఎంతో మద్దతు ఇస్తోంది. రూ. 650 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టాము. ఎంతో మందికి ఉపాధి కల్పించాము. రాబోయే రోజుల్లో మరిన్ని యూనిట్లు నెలకొల్పుతాము.  శ్రీ సిటీ ఫ్యాక్టరీ ఏర్పాటులో ప్రభుత్వ సహకారం మరువలేనిది. మా కంపెనీ ద్వారా 600 ఉద్యోగాలు కల్పించాము. మా కంపెనీలో 50 శాతం మంది మహిళలే. కంపెనీలో ఉద్యోగలంతా స్థానికులే. మొత్తం ఆరు ఆపరేటింగ్‌ లైన్స్‌తో ప్రొడక్షన్‌ జరుగుతోంది. అదనంగా మరొక లైన్‌ ద్వారా ఉత్పత్తి చేయబోతున్నాము. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీనే పెట్టుబడులకు అనుకూలం. - క్యాడ్‌బరీ ఇండియా ప్రెసిడెంట్‌ దీపక్‌

ఏపీ బిజినెస్‌ పాలసీ, మౌలిక వసతులు పరిశ్రమల పెట్టుబడులకు అనుకూలం. పరిశ్రమలకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు బాగున్నాయి.
- తాయి జిన్‌ పార్క్‌ కియా మోటర్స్‌ ఎండీ, సీఈవో

► ఏపీలో పెట్టుబడులకు అద్భుత అవకాశాలు ఉన్నాయి. బల్క్ డ్రగ్స్, స్పైస్ పరిశ్రమల నెలకొల్పేందుకు మంచి అనుకూల వాతావరణం ఉంది. నైపుణ్యం ఉన్న మానవ వనరులు అందుబాటులో ఉన్నాయి. నిరంతర విద్యుత్, ల్యాండ్ బ్యాంక్‌, సమృద్దిగా ఉంది. -బుగ్గన రాజేంద్రనాథ్, ఏపీ ఆర్థిక శాఖ మంత్రి.  

సాక్షి, ఢిల్లీ: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఢిల్లీ జరుగుతున్న  ఏపీ గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సదస్సు సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో సీఎం జగన్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి, స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్యతో పాటు పలువురు అధికారుల బృందం ఉన్నారు. అనంతరం, వివిధ దేశాల దౌత్యవేత్తలతో రౌండ్‌ టేబుల్ సమావేశం నిర్వహించారు. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top