ఏవోబీ వద్ద ఉద్రిక్తత

Clash Between Police and Moist at AOB - Sakshi

సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఏజెన్సీ ఆంధ్ర ఒరిస్సా సరిహద్దులో మావోయిస్టుల దుశ్చర్యకు పాల్పడ్డారు. మంగళవారం మావోయిస్ట్‌లు రెండు వాహనాలను దగ్ధం చేశారు.  ఈ ఘటన ఒడిశాలోని మల్కన్ గిరిజిల్లా పప్పర్లమెట్ట అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది. దీంతో పోలీసు బలగాలు అప్రమత్తమయ్యాయి. మావోయిస్టులు, భద్రతాబలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. దీంతో విశాఖ పోలీసులు అప్రమత్తమయ్యి ఏవోబీ ప్రాంతంలో నిఘాను పెంచారు. ఏవోబీ వద్ద మావోయిస్ట్‌లకు చెందిన భారీ  డంప్‌ను ఒడిశా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాకు చెందిన ఎస్‌వోజీ, బీఎస్‌ఎఫ్‌ పోలీసులు సంయుక్తంగా మావోయిస్ట్‌ల కోసం గాలింపు చేపట్టారు.

ఈ నేపథ్యంలో క‌టాఫ్ ఏరియాలోని జొడొంబో పోలీసుస్టేష‌న్  ప‌రిధిలోని ముకిడిపల్లి, గురుసేతు, బెజ్జింగి, జంప‌లూరు, ప‌ర్లుబంద గ్రామాల్లో సంయుక్తంగా గాలింపు చ‌ర్య‌లు నిర్వ‌హిస్తుండ‌గా, మావోయిస్టులు దాచి ఉంచిన డంప్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో  ఒక దేశీయ‌తుపాకీ, క్లైమెర్‌మెన్‌,వైర్‌, మూడు రంగుల్లో ఉన్న పేలుడు సామాగ్రీ,  ఎనిమిది ఎల‌క్ర్టిక్ డిటోనేట‌ర్లు , ఆక్సిజ‌న్ సిలిండ‌ర్‌, కెమెరాఫ్లాష్‌,  ఇనుప‌పైపులు, వైరు, మావోయిస్టు విప్ల‌వసాహిత్యంకు సంబంధించిన వాటిని ఒడిశా పోలీసుల స్వాధీనం చేసుకున్నారు. 

చదవండి: సినీ నటి, బీజేపీ నేత కుష్బూ అరెస్టు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top