Video: బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌పై విరిగిన కుర్చీ విసిరాడు! ఆపై..

Chair Thrown At Bihar Chief Minister Nitish Kumar - Sakshi

పాట్నా: బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌పై సోమవారం దాడికి యత్నం జరిగింది. ఔరంగాబాద్‌ జిల్లాలో సమాధాన్‌ యాత్ర సందర్బంగా సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. 

విరిగిన కుర్చీ ముక్కను సీఎం నితీశ్‌పైకి విసిరేశాడు ఓ యువకుడు. అయితే టైంకి ఆయన ఆగిపోవడంతో.. అది పక్కన పడింది. వెంటనే అది గమనించిన ఆయన పక్కనే ఉన్న సిబ్బంది అప్రమత్తమై ఆయన్ని రౌండప్‌ చేసి ముందుకు తీసుకెళ్లారు. దాడికి పాల్పడిన వ్యక్తి వెంటనే అక్కడి నుంచి పరుగులు అందుకున్నాడు.

ప్రజలతో ఆయన మమేకమై మాట్లాడుతున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఓ యువకుడు ఈ దాడికి పాల్పడగా.. పారిపోయిన ఆ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భద్రతా ఉల్లంఘనలకు గానూ అతనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దాడి యత్నానికి గల కారణాలు మాత్రం వెల్లడించలేదు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top