ఒవైసీపై దాడి.. కేంద్ర హోం శాఖ కీలక నిర్ణయం, సీఆర్పీఎఫ్‌తో జెడ్‌ కేటగిరీ భద్రత

Centre Provides Z Category Security To AIMIM chief Asaduddin Owaisi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీపై దాడి నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. నిన్నటి కాల్పుల ఘటన తర్వాత ఆయన భద్రతపై కేంద్ర హోం శాఖ సమీక్ష నిర్వహించింది. 

సమీక్ష అనంతరం.. సీఆర్ఫీఎఫ్‌తో జెడ్‌ కేటగిరీ భద్రత ఇవ్వాలని నిర్ణయించుకుంది. తక్షణమే సెక్యూరిటీ భద్రత అమల్లోకి వచ్చేలా ఆదేశాలు జారీ చేసింది కేంద్ర హోం శాఖ. ఇదిలా ఉండగా.. కాల్పుల ఘటనకు సంబంధించి ఇద్దరిని యూపీ పోలీసులు అరెస్ట్‌ చేసి.. ప్రశ్నిస్తు‍న్నారు. మరోవైపు ఘటనపై దర్యాప్తునకు ఆదేశించాలని ఈసీని కోరిన ఒవైసీ.. ఈ దాడి వెనుక మాస్టర్‌ మైండ్‌ ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తు‍న్నారు. మరోవైపు అసదుద్దీన్‌ ఒవైసీ శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో లోక్‌సభ స్పీకర్‌ ఓం బీర్లాను కలవనున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు లోక్‌సభలో తనపై జరిగిన కాల్పుల ఘటనను వివరించనున్నారు. 

జెడ్‌ కేటగిరీలో.. నలుగురు నుంచి ఆరుగురు NSG కమాండోలు, పోలీసు సిబ్బందితో సహా 22 మంది సిబ్బంది ఉంటారు. ఇందులో.. ఒక ఎస్కార్ట్ కారుతో పాటు ఢిల్లీ పోలీసులు లేదంటే ITBP లేదంటే CRPF సిబ్బంది ఉంటారు.

చదవండి: అసదుద్దీన్‌ ఒవైసీ కాన్వాయ్‌పై కాల్పులు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top