భూ రికార్డులు చూశాకే ధాన్యం కొనుగోలు

Centre to cross-check farmers land records before paddy procurement - Sakshi

న్యూఢిల్లీ: ధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) వ్యాపారులకు కాకుండా అసలైన రైతులకే దక్కేలా కీలక నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆహార శాఖ కార్యదర్శి సుదాన్షు పాండే  చెప్పారు. వచ్చే నెల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసేటప్పుడు రైతుల భూమి రికార్డులను పరిశీలించనున్నట్లు (క్రాస్‌చెక్‌) సుదాన్షు తెలిపారు. రాష్ట్రాల్లోని డిజిటల్‌ ల్యాండ్‌ రికార్డులను ఎఫ్‌సీఐతో అనుసంధానించినట్లు వెల్లడించారు.

రైతన్నల ప్రయోజనాల కోసమే ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొస్తున్నట్లు స్పష్టం చేశారు. రైతులు వారి సొంత భూమిలో లేదా కౌలుకు తీసుకున్న భూమిలో పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం సేకరిస్తుందని అన్నారు. ఏ ప్రాంతంలో ఎంత పంట పండించారు అనేది తెలుసుకోవడంతోపాటు అసలైన రైతులకు కనీస మద్దతు ధర దక్కేలా చేయడమే భూమి రికార్డుల క్రాస్‌చెక్‌ ఉద్దేశమని వివరించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top