హైదరాబాద్‌-తిరుపతి మధ్య తగ్గనున్న 80 కి.మీ. దూరం

Central Government gives Green Signal to122-km Roads in Telugu States - Sakshi

జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌

సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. తెలంగాణలోని కల్వకుర్తి నుండి ఆంధ్రప్రదేశ్‌లోని కరివేన వరకు 122  కిలోమీటర్ల జాతీయ రహదారి  నిర్మాణానికి  కేంద్ర జాతీయ రహదారుల శాఖ అనుమతి  తెలిపింది. ఈ నూతన జాతీయ రహదారితో హైదరాబాద్‌ నుంచి తిరుపతి మద్య 80 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. కల్వకుర్తి, నాగర్ కర్నూల్ , కొల్లాపూర్, ఆత్మకూరు,  నంద్యాల  నియోజకవర్గాలను కలుపుతూ జాతీయ రహదారి నిర్మాణం చేపట్టనుంది. భారతమాల పథకం కింద జాతీయ రహదారికి  అనుమతి ఇచ్చిన కేంద్ర రవాణా శాఖ ఆమోదం తెలిపింది.  (హైవేల విస్తరణకు నిధులు)

అలాగే ప్రాజెక్ట్‌లో భాగంగా సోమశిల సిద్దేశ్వరం బ్రిడ్జి నిర్మాణం చేయనుంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం  800 కోట్ల  రూపాయలు ఖర్చు చేయనుంది. 86 కిలోమీటర్లు తెలంగాణలోనూ, 26 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్‌లో నిర్మాణం జరుగుతుంది. కేంద్ర రవాణాశాఖ మంత్రిని సోమవారం జాతీయ బీసీ కమిషన్‌ సభ్యులు ఆచారి, నాగర్‌ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎల్లేని సుధాకర్‌ రావు, నాగర్‌ కర్నూలు అసెంబ్లీ ఇన్‌ఛార్జ్‌ నెడునూరి దిలీపాచారి కలిసి కృతజ్ఞతలు తెలిపారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేస్తామని గడ్కరీ వారికి హామీ ఇచ్చారు. (రోడ్లకు నష్టం.. రూ.500 కోట్లు)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top