CBSE Exams 2021: జులైలో సీబీఎస్‌ఈ పరీక్షలు? | CBSE Has Suggested Two Options For The Class 12 Board Exams | Sakshi
Sakshi News home page

CBSE Exams 2021: జులైలో సీబీఎస్‌ఈ పరీక్షలు?

May 23 2021 5:38 PM | Updated on May 23 2021 7:29 PM

CBSE Has Suggested Two Options For The Class 12 Board Exams - Sakshi

న్యూఢిల్లీ: బోర్డు పరీక్షలు జరిపేందుకే మొగ్గు చూపుతోంది సీబీఎస్‌ఈ. ఇందుకు సంబంధించి రెండు విధి విధానాలను పరిశీలిస్తోంది. ఆ వివరాలను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి సీఈఎస్‌ఈ తెలియజేసింది. అయితే దీనిపై ఇంకా కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటికే సీబీఎస్‌ఈ  12వ తరగతి పరీక్షలు జరగాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. సెకండ్‌వేవ్‌ విజృంభణతో ఈ పరీక్షలు వాయిదా వేస్తారని ప్రచారం జరిగింది. అయితే పరీక్షల నిర్వాహణకే సీబీఎస్‌ఈ మొగ్గు చూపింది.

మూడు నెలల్లో
12 తరగతి పరీక్షలు నిర్వహించేందుకు రెండు పద్దతులను కేంద్రం ముందు ఉంచింది సీబీఎస్‌ఈ. ఇందులో మొదటి పద్దతి ప్రకారం పరీక్షల ప్రక్రియను మూడు నెలల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. మొదటి నెలలో ప్రీ ఎగ్జామ్స్‌ యాక్టివిటీస్‌,  రెండో నెలలో పరీక్షల నిర్వహించడం, మూడో నెలలో ఫలితాలు వెల్లడి వంటివి ఉంటాయి. అయితే పరీక్షలు ప్రధాన సబ్జెక్టులకే నిర్వహిస్తారు. ఇందులో వచ్చే మార్కుల ఆధారంగా మిగిలిన సబ్జెక్టుల్లో మార్కులు కేటాయిస్తారు. దీని ప్రకారం జూన్‌లో పరీక్షా తేదీలను ప్రకటించి జులైలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. 

నాలుగు సబ్జె‍క్టులే 
ఇక రెండో ఆప్షన్‌ ప్రకారం పరీక్షా సమయాన్ని కేవలం 90 నిమిషాలకు కుదించి 4 సబ్జెక్టుల్లో పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో ఒకటి కచ్చితంగా భాషకు సంబంధించి అయి ఉండాలి. మిగిలిన మూడు సబ్జెక్టులను విద్యార్థులు ఎంపిక చేసుకోవచ్చు. మొత్తంగా విద్యార్థులు నాలుగు పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఇందులో వచ్చే మార్కుల ఆధారంగా మిగిలిన రెండు సబ్జె‍క్టులకు మార్కులు కేటాయిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement