నేషనల్‌ రిక్రూట్‌మెంట్‌ ఏజెన్సీ ఏర్పాటుకు ఆమోదం

Cabinet Approves National Recruitment Agency - Sakshi

మూడు ఎయిర్‌పోర్టుల లీజుకు గ్రీన్‌సిగ్నల్‌

సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో భారీ మార్పునకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కామన్‌ ఎలిజిబిలిటీ పరీక్షలు నిర్వహించేందుకు జాతీయ రిక్రూట్‌మెంట్‌ ఏజెన్సీ (ఎన్‌ఆర్‌ఏ) ఏర్పాటుకు కేంద్ర కేబినెట్‌ బుధవారం ఆమోదముద్ర వేసింది. ఎన్‌ఆర్‌ఏ ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలన్నింటికీ ఒకే ఉమ్మడి పరీక్ష నిర్వహిస్తారు. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌లో 1517 కోట్ల రూపాయల కేటాయింపుతో ఎన్‌ఆర్‌ఏ ఏర్పాటును ప్రభుత్వం ప్రతిపాదించింది. అన్ని ఉద్యోగాలకు ఉమ్మడి సిలబస్‌తో ఉమ్మడి పరీక్షను నిర్వహిస్తారు. కాగా, ఈ నిర్ణయం దేశంలో ఉద్యోగాలు కోరుకునే యువతకు తోడ్పాటు అందిస్తుందని కేంద్ర మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలతో పాటు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాళీల భర్తీకి ఎన్‌ఆర్‌ఏ ఒకే ఎంట్రన్స్‌ పరీక్షను నిర్వహిస్తుంది. రిక్రూట్‌మెంట్‌ బోర్డులు తుది పరీక్షలు నిర్వహిస్తాయి. ఒకసారి పరీక్ష రాస్తే మూడేళ్లపాటు మార్కులకు వ్యాలిడిటీ ఉంటుంది. ప్రతి జిల్లాలో పరీక్షా కేంద్రం ఏర్పాటు చేసి కంప్యూటర్‌ ద్వారా ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహిస్తారు.

ప్రస్తుతం నియామక పరీక్షలను యూపీఎస్‌సీ, ఎస్‌ఎస్‌సీ వంటి సంస్ధలు నిర్వహిస్తున్నాఆయి. ఇక ప్రభుత్వ-ప్రైవేట్‌ భాగస్వామ్యంలో (పీపీపీ) మోడల్ కింద జైపూర్, తిరువనంతపురం, గౌహతి ఎయిర్‌పోర్టులను లీజుకు ఇచ్చేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి  వెల్లడించారు. ఈ ఎయిర్‌పోర్ట్‌లను ప్రైవేట్‌ డెవలపర్‌కు అప్పగించడం ద్వారా ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ)కు 1070 కోట్ల రూపాయలు సమకూరుతాయని మంత్రి తెలిపారు. ఈ మూడు ఎయిర్‌పోర్ట్‌ల అభివృద్ధిని చేసేందుకు కేంద్రప్రభుత్వం డెవలపర్‌గా అదానీ గ్రూప్‌ను ఎంపిక చేసింది. చదవండి : ‘ఆరు నెలల్లో మీరు‌ సాధించినవి ఇవే’

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top