మరొకర్నీపెళ్లి చేసుకున్న వధువు! షాక్‌లో వరుడు

Bride Married Another Man Groom Failed To Reach Wedding On Time - Sakshi

Father of a bride married her daughter to one of his relatives: ప్రతి ఒక్కరి జీవితంలోని అతి ముఖ్యమైన ఘట్టం పెళ్లి. ఆ విషయాన్ని చాలా తేలిగ్గ తీసుకుని మద్యం మత్తులో చిందులేస్తూ ఉన్నాడు ఇక్కడొక వ్యక్తి. ముహుర్త సమయానికి చేరుకోకపోవడంతో వరుడికి ఊహించిన షాక్‌ ఇచ్చాడు పెళ్లి కూతురు తండ్రి. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది.

వివరాల్లోకెళ్తే...మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో మల్కాపూర్ పాంగ్రా గ్రామంలో పెళ్లి జరగాల్సి ఉంది. వధువు తల్లితండ్రులు పెళ్లికి కావల్సిన ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. పెళ్లి మండపం వద్ద వరుడు రాక కోసం పెళ్లి కూతురు తరుఫు బంధువులంతా వేచి చూస్తున్నారు. ముహుర్తం సాయంత్రం నాలుగు గంటలకు ఐతే ఎనిమిదవుతున్న రాకపోయేసరికి వధువు తండ్రి బంధువులను సంప్రదించి వేరే వ్యక్తితో తన కుమార్తె వివాహం జరిపించాడు.

ఇంతలో తాగుతు మండపానికి చేరిన వరుడు, అతని స్నేహితులు ఈ తంతు చూసి గొడవకు దిగారు. దీంతో వధువు తల్లిదండ్రులు ముహుర్త సమయానికి రాలేక పోవడంతోనే మా బంధువుల్లోని వ్యక్తితో వివాహం జరిపించామని తెగేసి చెప్పాడంతో చేసేదిలేక అవమానంతో వెనుదిరిగారు వరుడు తరుఫువారు.

(చదవండి: సృష్టించిన వాడినే అంతం చేసేందుకు యత్నించిన మైక్రోవేవ్‌)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top