కాసేపట్లో పెళ్లి.. పీటలపై ఊహించని ట్విస్ట్‌తో వరుడికి షాకిచ్చిన వధువు

Bride Calls Off Wedding After Groom Family Sends Her Cheap Lehenga - Sakshi

పెళ్లి సమయం దగ్గర పడింది. ఇరు కుటుంబ సభ్యులు ఏర్పాట్ల బిజీలో నిమగ్నమయ్యారు. పెళ్లికొచ్చిన చుట్టాలు, మామిడి తోరణాలతో ఇల్లంతా పండుగ వాతావరణం నెలకొంది. కన్నుల జరిగే పెళ్లిని చూసేందుకు అందరూ ఎదురుచూస్తున్నారు. కానీ.. ఊహించని ట్విస్ట్ తో వైభవంగా జరగాల్సిన పెళ్లి ఆగిపోయింది. భార్యతో కొత్తజీవితాన్ని ప్రారంభించాలని కలలు కంటున్న వరుడితోసహా.. అందరికీ వధువు గట్టి షాకిచ్చింది.

వరుడు కుటుంబం ఖరీదైన లెహంగా కొనలేదనే కారణంతో వధువు పీటల మీద పెళ్లిని ఆపేసింది. ఈ వింత ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని హల్ద్వానీలో వెలుగుచూసింది. రాజ్‌పురాకు చెందిన యువతికి ఈ జూన్‌లో ఓ యువకుడితో ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. నవంబర్‌ 5న పెళ్లి జరగాల్సి ఉంది. దీంతో సంప్రదాయం ప్రకారం వరుడు తరుపు వారు వధువుకి వివాహం దుస్తులు కొనిచ్చారు. పెళ్లి రోజు రానే వచ్చింది. అందంగా ముస్తాబైన వధూవరులు తమ కుటుంబాలతో వేదిక వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో తన పెళ్లి లెహంగా కోసం వరుడు ఫ్యామిలీ కేవలం రూ. 10 వేలు ఖర్చు చేశారనే విషయం వధువుకి తెలిసింది.

దీంతో ఆగ్రహం చెందిన యువతి పచ్చటి పందిట్లో ఈ వివాహం తనకొద్దంటూ తేగేసి చెప్పింది. షాకైన వరుడు తండ్రి అమ్మాయి వద్దకు వచ్చి తనకు నచ్చిన లెహంగా కొనుక్కోవాలని ఏటీఎం కార్డు కూడా ఇచ్చాడు. అంతేగాక యువతి లెహంగాను ప్రత్యేకంగా లక్నో నుంచి తీసుకొచ్చామని వరుడి తల్లిదండ్రులు చెబుతున్నారు. అయినప్పటికీ ఆమె అందుకు అంగీకరించలేదు. ఇక ఈ విషయం పోలీస్‌ స్టేషన్‌ వరకు వెళ్లింది.  పోలీసులు, బంధువులు ఎంత సర్ధిచెప్పాలని చూసిన ప్రయోజనం లేకుండాపోయింది. అనేక గొడవల అనంతరం చివరికి పెళ్లిని రద్దు చేయాలని నిర్ణయించుకున్నారు.  
చదవండి: స్నేహితుడి పెళ్లిలో చీరలో మెరిసిన అమెరికన్స్‌.. ఎంత సక్కగున్నారో!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top