ఘోరం: కరోనా పేషెంట్‌కు ఆవు మూత్రం పోసిన నేత

BJP Leader Feeding Cow Urine To Covid Patient - Sakshi

గాంధీనగర్‌: ఓ బీజేపీ నాయకుడు దారుణానికి పాల్పడ్డాడు. వెంటిలేటర్‌పై ఉన్న కరోనా బాధితురాలికి ఆవు మూత్రం తాగించాడు. తాగించడమే కాకుండా దానికి సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో పంచుకున్నాడు. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడి తీరును ఖండిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఎలా ఉందో తెలియడం లేదు.

గుజరాత్‌లోని సూరత్‌లో ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా బాధితురాలి వద్దకు బీజేపీ సూరత్‌ ప్రధాన కార్యదర్శి కిశోర్‌ బిందల్‌ వచ్చాడు. పీపీఈ కిట్‌ ధరించి బీజేపీ కండువా వేసుకుని వచ్చిన అతడు ఓ బాటిల్‌ తీసుకొచ్చాడు. యాసిడ్‌ రంగులో ఉన్న ద్రావణం ఆమె నోటిలో పోశాడు. ఆమెకు బలవంతంగా బిందల్‌ ఆవు మూత్రం తాగించాడు. దీనికి సంబంధించిన వీడియోను అతడు యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేశాడు. దాదాపు 80 వేల వ్యూస్‌ వచ్చాయి. ఆ వ్యూస్‌తో పాటు ఘోరంగా తిట్లు.. విమర్శలు రావడంతో దెబ్బకు ఆ వీడియోను బిందల్‌ తీసేశాడు. అయితే అప్పటికే ఆ వీడియో పలువురు షేర్‌ చేయడం.. కాపీ చేసుకోవడంతో నెట్టింట్లో వైరల్‌గా మారింది. 

ఆ బీజేపీ నాయకుడి చర్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ నాయకులు ఎప్పటి నుంచో కరోనాకు విరుగుడు ఆవుమూత్రం అని చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు అది నిరూపించేందుకు కరోనా బాధితురాలికి ఆవు మూత్రం తాగించాడని తెలుస్తోంది. అయితే ఈ ఘటనపై ఎలాంటి వివరాలు తెలియడం లేదు. ఏ ఆస్పత్రి? బాధితురాలు ఎవరు? అనేది తెలియడం లేదు. పార్టీ నాయకుడిని ఆస్పత్రిలో కండువా ధరించి ఎలా అనుమతించారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఎలా ఉందో తెలియడం లేదు. ఈ సంఘటన జరిగి చాలా రోజులైనా ఇప్పుడు వైరలవుతోంది.

చదవండి: సంతలో లస్సీ.. 100 మంది ప్రాణం మీదకు వచ్చింది..
చదవండి: ఆక్సిజన్‌ అందక కర్నూలులో ఐదుగురు మృతి

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top